న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3టీ క్రికెట్ సూపర్ హిట్.. డివిలియర్స్‌ టీమ్‌కు గోల్డ్!

3TCricket Solidarity Cup 2020: De Villiers Team Eagles Clinch Gold

సెంచూరియన్‌: టెస్ట్, వన్డే, టీ20, టీ10.. క్రికెట్‌లో ఇప్పటి వరకు మనం చూసిన ఫార్మాట్లు. ఈ జాబితాలో ఇప్పుడు కొత్త ఫార్మాట్ వచ్చి చేరింది. మిగతా ఫార్మాట్లకు పూర్తి విభిన్నంగా ఒక మ్యాచ్‌లో మూడు జట్లు తలపడేలా రూపొందించిన 3టీమ్ క్రికెట్‌ను సౌతాఫ్రికా శనివారం ప్రపంచానికి పరిచయం చేసింది. కరోనా దెబ్బ తర్వాత ఎలాగైనా క్రికెట్‌ను మొదలు పెట్టాలనే సంకల్పంతో సఫారీ బోర్డు రూపొందించిన ఈ కొత్త ఫార్మాట్‌‌ను 'నెల్సన్‌ మండేలా డే' రోజున నిర్వహించింది.

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా (సుమారు 82 వేలు) ఉన్న గాటెంగ్‌ ప్రావిన్స్‌లో ప్రజల కు భరోసా కల్పించే ఉద్దేశంలో అక్కడే మ్యాచ్‌ ను నిర్వహించారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా కారణంగా ఇబ్బంది పడ్డ క్రికెట్ కమ్యూనిటీకి అందజేస్తారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతుగా ఈ ఈవెంట్‌కు సాలిడారిటీ కప్ అని పేరు పెట్టారు. మ్యాచ్ ముందు క్రికెటర్లంతా మోకాళ్లపై కూర్చొని తమ సంఘీభావం ప్రకటించారు.

సూపర్ హిట్..

సూపర్ హిట్..

36 ఓవర్లలో మూడు జట్లు.. రెండు అర్ధభాగాల్లో తలపడ్డ ఈ సాలిడారిటీకప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ సూపర్ హిట్టయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సారథ్యంలోని ఈగల్స్ జట్టు విజేతగా నిలిచింది. మిగతా రెండు ప్రత్యర్థి జట్లను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.

మ్యాచ్ ఇలా సాగింది..

మ్యాచ్ ఇలా సాగింది..

డివిలియర్స్‌ నాయకత్వంలో ‘ఈగల్స్‌' టీమ్‌తో పాటు తెంబా బవుమా సారథిగా ఉన్న ‘కైట్స్‌', రీజా హెన్‌డ్రిక్స్‌ కెప్టెన్సీ చేసిన ‘కింగ్‌ఫిషర్స్‌' జట్లు బరిలోకి దిగాయి. నిబంధనల ప్రకారం ప్రతీ జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది ఆటగాళ్లే ఉంటారు. మూడు జట్లు కలిపి ఒకే సారి 36 ఓవర్ల ఈ మ్యాచ్‌లో తలపడతాయి.రెండు భాగాలుగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

ఒక్కో జట్టు 6 + 6 ఓవర్ల చొప్పున 12 ఓవర్లు ఆడుతుంది. ప్రతీ జట్టు తొలి భాగంలో ఒక ప్రత్యర్థిని, రెండో భాగంలో మరో పత్య్రర్థిని ఎదుర్కొంటుంది. తొలి ఓవర్లు అయిపోయిన తర్వాత ఎక్కువ రన్స్ చేసిన జట్టు సెకండాఫ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అపై, సెకండ్ అత్యధిక స్కోరర్, తర్వాత మూడో జట్టు బ్యాటింగ్‌కు వచ్చాయి. ప్రతీ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ఫీల్డర్లను అనుమతించారు. గ్రౌండ్‌ను ఆరు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌లో ఒక్కో ఫీల్డర్‌ను ఉంచారు. ఓ బౌలర్‌గా అత్యధికంగా మూడు ఓవర్లు కేటాయించారు.

ఫస్టాఫ్‌ ఫస్ట్ ఈగల్స్..

ఫస్టాఫ్‌ ఫస్ట్ ఈగల్స్..

ముందుగా తీసిన డ్రా ప్రకారం ఫస్టాఫ్‌లో తొలుత కింగ్ ఫిషర్స్ బ్యాటింగ్‌కు రాగా... కైట్స్ బౌలింగ్ చేసింది. 6 ఓవర్లలో కింగ్ ఫిషర్స్ 2 వికెట్లకు 56 రన్స్ చేసింది. మలాన్(31), హెండ్రిక్స్(20) రాణించారు. నోర్జ్ ఓ వికెట్ తీశాడు. అపై ఈగల్స్ బ్యాటింగ్ చేయగా.. కింగ్ ఫిషర్స్ టీమ్ బౌలింగ్ చేసింది. ఆరు ఓవర్లలో ఈగల్స్ ఒక వికెట్ నష్టానికి 66 రన్స్ రాబట్టింది. మార్‌క్రమ్(47 నాటౌట్), డివిలియర్స్(11 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఆపై బ్యాటింగ్‌కు వచ్చిన కైట్స్ 6 ఓవర్లలో 58/1 స్కోర్ చేసింది. స్మట్స్ (36 నాటాటౌట్) రాణించాడు.

సెకండాఫ్ ధనాధన్

సెకండాఫ్ ధనాధన్

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ ఆసక్తికరంగా సాగింది. ఫస్టాఫ్‌తో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఈగల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. కైట్స్ బౌలింగ్ చేసింది. నాటౌట్‌గా నిలిచిన ఐడెన్ మార్‌క్రమ్, డివిలియర్స్ చెలరేగడంతో ఈగల్స్ ఇంకో ఆరు ఓవర్లలో ఏకంగా 9 పరుగులు చేసింది. మార్క్‌రమ్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. డివిలియర్స్ 21 బంతుల్లోనే ఈ మార్క్ దాటాడు.

ఇక రెండు భాగాల్లో కలిపి డివిలియర్స్‌ ‘ఈగల్స్‌' టీమ్‌ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి స్వర్ణం గెలుచుకుంది. డివిలియర్స్‌ తనదైన శైలిలో చెలరేగి 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 3 వికెట్లకు 138 పరుగులు సాధించిన కైట్స్‌కు రజతం, 5 వికెట్లకు 113 పరుగులు చేసిన కింగ్‌ ఫిషర్స్‌కు కాంస్య లభించాయి.

Story first published: Sunday, July 19, 2020, 9:20 [IST]
Other articles published on Jul 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X