న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా రికార్డు సమం: భారత్‌కు షాకిచ్చిన లంక, ఢిల్లీ టెస్టు డ్రా

By Nageshwara Rao
Sri Lanka

హైదరాబాద్: నిజంగా శ్రీలంక జట్టుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. విజయం కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా... శ్రీలంక బ్యాట్స్‌మెన్ ముందు తేలిపోయారు. దీంతో ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది.

శ్రీలంక ఆటగాళ్లు ధనంజయ డిసిల్వా (119), రోషన్ సిల్వా (74 నాటౌట్), డిక్వెల్లా (44 నాటౌట్) అద్భుత పోరాటంతో లంక ఓటమి నుంచి తప్పించారు. చివరి రోజు టీమిండియా విజయానికి 7 వికెట్లు అవసరం కాగా 87 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు.

దీంతో మూడు టెస్టుల సిరిస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. భారత జట్టుకిది వరుసగా తొమ్మిదో సిరీస్‌ విజయం కావడం విశేషం. దీంతో గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సమం చేసింది. చివరిరోజైన బుధవారం మ్యాచ్‌లో మ‌రింత స‌మ‌యం మిగిలి ఉన్నప్పటికీ, ఫ‌లితం వ‌చ్చేలా కనిపించకపోవడంతో ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

మ్యాచ్ డ్రాగా ముగిసే స‌మ‌యానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 299 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఓ విదేశీ జట్టు భార‌త గ‌డ్డ‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో చేసిన అత్య‌ధిక ప‌రుగులు ఇవే కావడం విశేషం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

స్కోరు వివరాలు:
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 536/7 డిక్లేర్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 373
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 246/5 డిక్లేర్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: 299/6 (103 ఓవర్లకు)


టీ విరామానికి శ్రీలంక 226/5
ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ధీటుగా బదులిస్తోంది. టీ విరామానికి 81 ఓవర్లకు 226/5 పరుగులు చేసింది. రోషన్‌ సిల్వా (38), నిరోషన్‌ డిక్వెలా (11) క్రీజులో ఉన్నారు. తొడ కండరాలు పట్టేయడంతో శతకం సాధించిన తర్వాత ధనంజయ డిసిల్వా (119) పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

భారత విజయానికి అడ్డుగా నిలిచిన ధనుంజయ
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డిసిల్వా (119) టీమిండియా విజయానికి అడ్డుగా నిలిచాడు. ఆ అడ్డుని తొలగించేందుకు భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఓపెనర్‌ మురళీ విజయ్‌, విరాట్‌ కోహ్లీ సైతం బౌలింగ్‌ చేశారు. 75వ ఓవర్‌ను మురళీ, 76వ ఓవర్‌ను కోహ్లీ వేశారు. ఇంతలో తొడ కండరాలు పట్టేయడంతో ఫిజియోను సంప్రదించి ధనంజయ రిటైర్డ్ హట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం రోషన్‌ సిల్వా (29), నిరోషాన్‌ డిక్వెలా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. 77 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

సెంచరీతో మెరిసిన ధనంజయ డిసిల్వా
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ధనుంజయ డి సెల్వ సెంచరీ సాధించాడు. రెండో వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన ధనంజయ నెమ్మదిగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. సహచర క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఔటవుతున్నా...
తాను మాత్రం పరుగులు సాధించాడు. 90 పరుగుల వద్ద కాస్త నెమ్మదించినప్పటికీ... షమి వేసిన 65.4వ బంతికి 3 పరుగులు తీసి టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు.

మొత్తం 188 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి శ్రీలంక 68 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ధనుంజయ(110), రోషన్ సెల్వా(11) పరుగులతో ఉన్నారు. దీంతో భారత విజయం మరింత ఆలస్యం అవుతోంది. లంక విజయానికి 232 పరుగులు అవసరం కాగా, భారత్ విజయానికి 5 వికెట్లు అవసరం.

చండీమాల్‌ని ఔట్ చేసిన అశ్విన్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం అనంతరం శ్రీలంక కెప్టెన్ చండీమాల్ (36)ను అశ్విన్ ఔట్ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో చండీమాల్ క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 112 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు ధనంజయ డిసిల్వా సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ధనంజయ డిసిల్వా (90), రోషన్‌ సిల్వా (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. 60 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

 India in search of wickets and win

లంచ్ విరామానికి శ్రీలంక 119/4
ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఐదో రోజు లంచ్ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 31/3తో బ్యాటింగ్‌ ఆరంభించిన శ్రీలంక ఐదోరోజైన బుధవారం నిలకడగా ఆడుతోంది.

ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా (72), దినేశ్‌ చండిమాల్‌ (27) పరుగులతో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 84 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ ఫామ్‌ను కొనసాగిస్తున్న చండీమాల్.. లంకను గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జడేజా తప్ప మిగతా బౌలర్లెవరూ తొలి సెషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

నోబాల్స్ వేసిన జడేజా
టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా చేసిన పొరపాటు వల్ల టీమిండియా ఐదో వికెట్‌ తీయలేకపోయింది. ఇన్నింగ్స్ 43.4వ బంతికి దినేశ్‌ చండిమాల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక రివ్యూని ఆశ్రయించింది. అయితే రివ్యూలో అది నో బాల్‌గా తేలడంతో దినేశ్‌ చండిమాల్‌ ఔట్ నుంచి తప్పించుకున్నాడు.

అంతకు ముందు శ్రీలంక జట్టు స్కోరు 35 పరుగుల వద్ద మాథ్యూస్‌ (1) రహానేకు క్యాచ్‌ ఇచ్చాడు. ఇదీ కూడా నోబాలే కావడం విశేషం. అయితే అంపైర్‌ గమనించకపోవడం... మాథ్యూస్‌ రివ్యూని కోరకపోవడంతో పెవిలియన్‌ చేరుకున్నాడు.

ధనంజయ డిసిల్వా హాఫ్ సెంచరీ

ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. శ్రీలంక ఆటగాడు ధనంజయ డిసిల్వా 115 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ దినేశ్ చండీమాల్ (24) నిలకడగా ఆడుతున్నాడు. 43 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసంది. శ్రీలంక విజయానికి 298 పరుగులు అవసరం కాగా భారత్ విజయానికి ఏడు వికెట్లు కావాలి.

3rd Test, Live: India in search of wickets and win

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు చివరి రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 31/3తో ఐదో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన శ్రీలంక మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే శ్రీలంక మూడో వికెట్ చేజార్చుకుంది.

టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడో వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఏంజెలో మాథ్యూస్‌ (1)ను పెవిలియన్‌ పంపించాడు. 21.6వ బంతిని ఆడిన అతడు స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 22 ఓవర్లకు గాను శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది.

క్రీజులో ధనంజయ డిసిల్వా (16), చండిమాల్‌ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 6, 2017, 20:31 [IST]
Other articles published on Dec 6, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X