న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ టెస్టు, డే 4: భారత్ విజయానికి 7 వికెట్లు

By Nageshwara Rao
Vijay departs early

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో ధనంజయ డిసిల్వా (13), ఏంజెలో మాథ్యూస్‌ (0) ఉన్నారు.

నాలుగో రోజు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 29 ఓవర్లు వేయాల్సి ఉన్నా వెలుతురులేమి కారణంగా 16 ఓవర్ల తర్వాత అంపైర్లు ఆటను నిలిపేశారు. మరోవైపు చివరి రోజంతా ఉండటం, స్పిన్నర్లు ఇప్పటికే వికెట్ల వేట మొదలుపెట్టడంతో లంకకు ఇక దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు.

కోహ్లీసేన విజాయనికి ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది. ఇదిలా ఉంటే శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 246/5కు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ధావన్‌ (67), కోహ్లీ (50), రోహిత్‌ (50) పుజారా (49) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో శ్రీలంక ముందు 410 పరుగుల లక్ష్యం ఉంచారు.

410 పరుగుల విజయ లక్ష్యంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఓపెనర్లు సదీర సమరవిక్రమ (5), కరుణరత్నె (13), నైట్ వాచ్‌మన్ లక్మల్ (0) వికెట్లు కోల్పోయింది. జడేజా 2, షమి ఒక వికెట్ తీసుకున్నారు.


Kohli

246/5 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 246/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 163 పరుగులు కలుపుకొని పర్యాటక శ్రీలంక జట్టుకు 410 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధావన్‌ (67), విరాట్‌ కోహ్లీ (50), రోహిత్‌ శర్మ (50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో మెరిశారు.

మరోవైపు పుజారా (49) త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రీలంకలో బౌలర్లలో లక్మల్‌, గమాగె, పెరీరా, ధనంజయ, సందకన్ తలో వికెట్‌ తీసుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసేందుకు గాను ఇంకా 31 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ ఔట్
ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అంతకముందు సందకన్ వేసిన49.6వ బంతికి సింగిల్‌ తీసి హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ ఆ తర్వాత ఓవర్‌ నాలుగో బంతికి లక్మల్‌‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి జడేజా వచ్చాడు. ప్రస్తుతం 51 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (43), రవీంద్ర జడేజా (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.


విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో కోహ్లీ (50) పరుగులు నమోదు చేశాడు. ప్రస్తుతం 50 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (50), రోహిత్ శర్మ (41) పరుగులతో ఉన్నారు.


టీ విరామానికి భారత్ 192/4

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన లంకపై 355 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (25), రోహిత్ శర్మ (28) పరుగులతో ఉన్నారు.


67 పరుగుల వద్ద ధావన్ ఔట్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (67) ఔటయ్యాడు. లంక పేసర్ సందకన్ వేసిన 35.2వ బంతికి ధావన్ స్టంపౌట్‌ అయ్యాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి రోహిత్ శర్మ వచ్చాడు. విరాట్‌ కోహ్లీ (19), రోహిత్‌ శర్మ (15) దూకుడుగా ఆడుతున్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.


Dhawan

హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్
బర్త్‌డే బాయ్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. సందకన్ వేసిన 33.2వ బంతికి సింగిల్‌ తీసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో పాటు కెరీర్‌లో 28 టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ధావన్‌కి తోడుగా క్రీజులో విరాట్ కోహ్లీ (3) పరుగులతో ఉన్నాడు.

హాఫ్ సెంచరీ మిస్: 49 పరుగుల వద్ద పుజారా ఔట్
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న పుజారా (49) పరుగుల వద్ద ఔటవ్వడంతో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు.


దూకుడుగా ఆడుతున్న పుజారా
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాడు పుజారా దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పుజారా 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ధావన్ (25) దూకుడుగా ఆడుతున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం లంకపై భారత్ 247 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 Vijay departs early

లంచ్ విరామానికి భారత్ 51/2

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ (15), పుజారా(17) పరుగులతో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, దిల్రువాన్ పెరీరా చెరో వికెట్ తీసుకున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన భారత్
ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఓపెనర్ మురళీ విజయ్ (9) సురంగ లక్మల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రహానే కూడా 10 పరుగుల వద్ద పెరీరా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ 195 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో శిఖర్ ధావన్‌ (10), పుజారా(3) పరుగులతో ఉన్నారు.

ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్

ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేసిన మురళీ విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

3rd Test, Live: India look to extend advantage. Vijay departs early

సురంగ లక్మల్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్ కీపర్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఒక వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (2), రహానే (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 373 ఆలౌట్
ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 356/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు మరో 17 పరుగులు జోడించి చివరి వికెట్ కోల్పోయింది. నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యాక 5 ఓవర్ల వ్యవధిలోనే ఆఖరి వికెట్‌ను కోల్పోయింది.

లంక కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ (164) పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వరుస బౌండరీలు బాది స్కోరు బోర్డుని పరిగెత్తించిన చండీమాల్... ఇషాంత్‌ శర్మ వేసిన 135.3వ బంతికి గాను శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. టెస్టుల్లో దినేశ్ చండీమాల్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

కాగా, లంక బ్యాట్స్ మెన్లలో సందకన్ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతొ తోలి ఇన్నింగ్స్‌లో లంకపై భారత్‌ 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లి (243) డబుల్ సెంచరీ సాధించగా, శ్రీలంక కెప్టెన్ చండీమల్ 164 పరుగులు చేశాడు.

ఒకే టెస్టులో రెండు జట్ల కెప్టెన్లూ 150కిపైగా పరుగులు చేయడం ఇది ఆరోసారి మాత్రమే కావడం విశేషం. మాథ్యూస్, చండీమల్ జోడీ పోరాడి నాలుగో వికెట్‌కు 181 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు బాది లంకను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించారు. భారత బౌలర్లలో ఇషాంత్, అశ్విన్‌లకు తలో మూడు వికెట్లు దక్కగా.. షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 17:14 [IST]
Other articles published on Dec 5, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X