న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ వన్డే: సఫారీ గడ్డ మీద చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీసేన

By Nageshwara Rao
IND v SA 3rd ODI : How India Performed Historically At Newlands Stadium
3rd ODI: Virat Kohli-led India on the cusp of history in South Africa

హైదరాబాద్: సుదీర్ఘమైన సఫారీ పర్యటన కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా డిసెంబర్ 2017న బయల్దేరింది. స్వదేశంలో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న కోహ్లీసేన సఫారీ గడ్డపై టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యాంగా 1-2తో సిరిస్‌ను కోహ్లీసేన చేజార్చుకుంది.

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఆరు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. అయితే టెస్టు సిరిస్‌ను కోల్పోయిన టీమిండియాకు వన్డే సిరిస్ ఊరటనిచ్చింది. వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం కేప్ టౌన్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

కోహ్లీ కాదని పాక్ కెప్టెన్‌కు ఓటేస్తావా మంజ్రేకర్..?: నెటిజన్ల మండిపాటుకోహ్లీ కాదని పాక్ కెప్టెన్‌కు ఓటేస్తావా మంజ్రేకర్..?: నెటిజన్ల మండిపాటు

ఇప్పటికే ఈ సిరిస్‌లో కోహ్లీసేన 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బుధవారం జరిగే మూడో వన్డేలో గనుక కోహ్లీ సేన విజయం సాధిస్తే, సఫారీల గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. సెంచూరియన్ వేదికగా రెండో వన్డేలో కోహ్లీసేన విజయం సాధించడంతో కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

'జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భువీ, షమీలను గుర్తు చేసుకుంటా''జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భువీ, షమీలను గుర్తు చేసుకుంటా'

సఫారీ గడ్డపై ఇప్పటివరకు వరుసగా ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్లలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. కోహ్లీకి ముందు ఈ ఘనతను ధోని నమోదు చేశాడు. 2011 దక్షిణాఫ్రికా పర్యటనలో ధోని ఈ ఘనత సాధించాడు. అప్పుడు ధోని నేతృత్వంలోని టీమిండియా 2-3తో సిరిస్‌ను చేజార్చుకుంది.

ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనను చూస్తుంటే కేప్ టౌన్ వేదికగా జరిగే మూడో టెస్టులో కూడా విజయం సాధించేలా కనిపిస్తోంది. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు సఫారీ బ్యాట్స్‌మెన్‌లకు తమ బౌలింగ్‌తో చుక్కలు చూపిస్తుంటే, ఆ జట్టు స్టార్ ప్లేయర్లు డివిలియర్స్, డుప్లెసిస్, డీకాక్‌లు దూరమవ్వడం ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టింది.

డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని చూసి అందరూ భయపడుతుండొచ్చుడ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని చూసి అందరూ భయపడుతుండొచ్చు

ఆరు వన్డేల సిరిస్‌కు ముందు ఐసీసీ ర్యాంకుల్లో భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో వరుసగా రెండు విజయాలను నమోదు చేయడంతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో దక్షిణాఫ్రికా రెండో స్థానానికి దిగజారింది. ఈ సిరిస్‌ను 4-2తో కోహ్లీసేన కైవసం చేసుకుంటే వన్డేల్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో సఫారీ గడ్డపై వరుసగా మూడు విజయాలను సాధించిన జట్టుగా కూడా కోహ్లీసేన నిలిచింది. 1992 నుంచి సఫారీ గడ్డపై టీమిండియా ఒక్క ద్వైపాక్షిక(వన్డే, టెస్టు) సిరిస్‌ను గెలవలేదు. అయితే ఈసారి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చరిత్రను తిరిగరాసేలా కనిపిస్తోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 16:44 [IST]
Other articles published on Feb 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X