న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాహ్.. క్రిస్ గేల్: నాలుగు మ్యాచ్‌లకు 38 పరుగులు

38 runs in 4 innings for West Indies - is Chris Gayle finished as cricket’s world boss?

హైదరాబాద్: ఒకప్పుడు క్రిస్ గేల్ అంటే ఓ సంచలనం. పేరు చెప్తే పరుగులే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు గేల్‌కి ఏమైంది. క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గేల్ ఎందుకిలా అయిపోయాడు. ఇటీవలే తను నాలుగు మ్యాచ్‌లు ఆడి సాధించింది 38 పరుగులేనా..

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ సరిగ్గా రాణించకపోవటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ లీగ్స్‌లో(ఐపీఎల్‌, బీపీఎల్‌) పరవాలేదనిపిస్తూ.. స్వదేశీ జట్టు తరపున మాత్రం పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.

మొత్తం 4 మ్యాచుల్లో 38 పరుగులు మాత్రమే
తాజాగా బీపీఎల్‌ ఫైనల్‌లో 146 పరుగులు చేసిన ఈ జెయింట్‌ బ్యాట్స్‌మన్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలం కావటంతో అవి మరింత ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 4 మ్యాచుల్లో 38 పరుగులు మాత్రమే సాధించాడు.

దీంతో ఇక అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చిందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో జట్టు కోచ్‌ సువర్ట్‌ లా గేల్‌కు అండగా నిలుస్తున్నాడు. 'ప్రస్తుతం అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అందుకే కివీస్‌ తో సిరీస్‌లో బంతులు ఎదుర్కొనలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇంతకు ముందు ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అతను రాణించిన విషయాన్ని విమర్శకులు మరిచిపోయారేమో! విమర్శలను గేల్‌ కూడా పట్టించుకోవటమే మంచింది. ప్రత్యర్థులపై విరుచుకుపడే సత్తా అతనికి మరికొంత కాలం ఉంది' అని బదులిచ్చాడు.


న్యూజిలాండ్‌ సిరీస్‌ ఓటమి ఒక్క గేల్‌ మూలంగానే అని ఎందుకంటున్నారో తనకు అర్థం కావట్లేదని తిట్టిపోశాడు. అది మొత్తం జట్టు వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించాడు. ఆ విషయంలో బోర్డు, అతన్ని తొలగించాలని పట్టుబడుతున్న కొందరు జట్టు సభ్యులు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే నిజాలు అర్థమవుతాయని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 15:26 [IST]
Other articles published on Jan 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X