టార్గెట్ రూ.2000 కోట్లు: 34 బ్రాండ్లతో స్టార్ ఇండియా ఒప్పందం

Posted By:
 34 sponsors sign up with Star India TV network for IPL 2018

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకా చకా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్, ఐపీఎల్ వేలం, స్పానర్‌షిప్ లాంటి కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. టోర్నీకి ముందు సంబంధించిన అన్ని కార్యక్రమాలను జనవరి-మార్చి మధ్యలోనే పూర్తి చేస్తున్నారు.

ఐపీఎల్ 2018: ప్రారంభ వేడుకల బడ్జెట్‌లో కోత, తేదీ మార్పు

ఐపీఎల్ 11వ సీజన్‌కు సంబంధించిన అతి పెద్ద వార్త ఏంటంటే ఐదేళ్ల కాలానికి గాను ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని హక్కులను స్టార్ ఇండియా రూ. 16,437.5 కోట్లకు దక్కించుకోవడం. అయితే, ఇప్పుడు అంతే మొత్తంలో స్టార్ ఇండియా ఆదాయాన్ని రాబట్టుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా స్టార్ నెట్ వర్క్‌తో 34 బ్రాండ్స్ ఒప్పందం చేసుకున్నాయి.

ఐపీఎల్ 2018 సీజన్ కోసం స్టార్ ఇండియాతో ఒప్పందం చేసుకున్న బ్రాండ్లలో జియో, AMFI, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, బ్లూస్టార్, సియట్ టైర్లు, క్రామ్టన్, డాలర్, డొమినోస్, పోర్డ్, హెయిర్, లుమినస్, ఫిడిలైట్, స్లీప్ వెల్, వెనెస్సా, విమల్ పాన్ మసాలా, వోల్టాస్, వివో, కోల్గేట్, అమూల్, కోకా-కోలా, డ్రీమ్ 11, ఎలికా, కెంట్, మేక్ మైట్రిప్, పార్లే ఆగ్రో, పార్లే ప్రొడక్ట్స్, పోలీక్యాబ్, యువి టీవీలు ఉన్నాయి.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యాడ్ సేల్స్ హెడ్ అనిల్ జయరాజ్ మాట్లాడుతూ పలు కార్పోరేట్ సంస్ధలు మాతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్లు మాపై నమ్మకం ఉంచి మా సంస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బ్రాండ్లను ప్రమోట్ చేస్తామని అన్నారు.

బ్రాండ్‌ను పెంపొందించుకునేందుకు 2018 వివో ఐపీఎల్ ఓ సరైన వేదిక అని తెలిపారు. గత సీజన్లలో పోలిస్తే ఈసారి స్థానిక భాషల్లో ఐపీఎల్‌ను అందించేందుకు స్టార్ ఇండియా ప్రయత్నిస్తోంది. హాట్ స్టార్, డీటీహెచ్, కేబుల్ ద్వారా సూపర్ ఫ్యాన్ ఫీడ్‌ను అందించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు.

ఐపీఎల్ యాడ్‌ల ద్వారా రూ. 2000 కోట్లు రాబట్టాలని స్టార్ ఇండియా లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ. 800 కోట్లు వచ్చాయని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభమై మే 27తో ముగియనుంది. లీగ్‌లో తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 7న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.

Story first published: Monday, March 12, 2018, 15:43 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి