ఐపీఎల్ 2022 వేలం.. అప్పుడే డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన మూడు జట్లు!!

IPL 2022 Auction : 3 Teams Target David Warner హాట్ కేకులా అమ్ముడుపోనున్న వార్నర్‌ | Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రాంచైజీ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు సారథిగా విఫలమయిన కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. ఇక న్యూజీలాండ్ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ను సారథిగా ప్రకటించింది. ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో మంగళవారం 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. టోర్నీలో 7 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం ఒకే ఒక్క విజయం అందుకుని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.

IPL 2021: మీ ప్రైవేట్ జెట్ వేసుకొచ్చి.. ఇక్క‌డి శ‌వాల‌ను చూడండి! ప్రధానిపై కామెంటేటర్ మ‌ళ్లీ సీరియ‌స్‌!

వార్నర్‌పై వేటు :

వార్నర్‌పై వేటు :

డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అదే ఏకైక టైటిల్‌. ఐపీఎల్‌ అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా దేవ్ కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గానూ తిరుగులేని రికార్డులతో కొనసాగుతున్న వార్నర్.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అయినా కూడా అతడిపై వేటు వేసింది. కేవలం 2021 సీజన్‌లో ఫస్ట్ హాఫ్ పర్ఫామెన్స్ బాగోలేదని వార్నర్‌పై వేటు వేసింది ఆరెంజ్ ఆర్మీ.

 2022లో మెగా వేలం:

2022లో మెగా వేలం:

డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం.. ఆ తర్వాత ఆడిన మ్యాచులో అతడికి కనీసం తుది జట్టులో చోటివ్వలేదు. మ్యాచ్ సమయంలో వాటర్ భాయ్ అవతారం ఎత్తాడు డేవిడ్. దీంతో ఐపీఎల్ 2022 వేలంలోకి వార్నర్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఒకటి లేదా రెండు జట్లు కొత్తగా రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది. ఐపీఎల్ 2022 వేలంలోకి వార్నర్‌ వస్తే మాత్రం హాట్ కేకులా అమ్ముడుపోనున్నాడు. కొత్త జట్లతో పాటు పాత జట్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వార్నర్‌ను దక్కించుకునేందుకు చూస్తున్నాయట.

బెంగళూరు:

బెంగళూరు:

ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. ఎప్పటిలా కాకుండా ఈసారి టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్లి.. కప్ కొట్టేలా కనిపించింది. అయితే కరోనా బెంగళూరు ఆశలకు గండికొట్టింది. అయితే బెంగళూరు జట్టులో మూడో స్థానంలో సరైన ఆటగాడు లేడు. ఎప్పుడూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ.. ఈసారి ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఈ సీజన్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ మరియు షాబాజ్ అహ్మద్ వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో మూడో స్థానంలో డేవిడ్ వార్నర్‌ను తీసుకుకోవాలని చూస్తోందట. ఇప్పటికే ఆ జట్టులో మ్యాక్సీ, ఏబీ ఉన్నారు.

రాజస్థాన్:

రాజస్థాన్:

13వ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆకట్టుకుంది. లీగ్ ఆరంభంలో వరుస విజయాలు అందుకుని.. ఆపై పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ 2021 మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆ జట్టు ప్రదర్శన ఆశాజనకంగా కనిపించినప్పటికీ.. నిలకడ లోపించింది. ఆడిన ఏడూ మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది. 2008లో టైటిల్ గెలుచుకున్న రాజస్థాన్.. ఇప్పటివరకు కూడా టైటిల్ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. టాప్ ఆర్డర్ బలిహీనంగా ఉన్నందున డేవిడ్ వార్నర్‌తో ఆ లోటును పూడ్చాలని చూస్తోంది.

కోల్‌కతా:

కోల్‌కతా:

ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిరాశపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్పై విజయంతో టోర్నీని ఆరంభించి.. ఆపై వరుసగా నాలుగు మ్యాచులు ఓడింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచే మ్యాచుల్లో ఓడింది. కోల్‌కతాకు సరైన బ్యాటింగ్ లైనప్ లేనందునే మ్యాచులు ఓడింది. ముఖ్యంగా మంచి ఓపెనింగ్ జోడి లేదు. గిల్, రాణా ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో డేవిడ్ వార్నర్‌ను ఓపెనర్‌గా పంపించి సరైన ఆరంభాలు దక్కించుకోవాలని చూస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 5, 2021, 22:19 [IST]
Other articles published on May 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X