
ధోనీ స్థానంలో జట్టు పగ్గాలు అందుకుని:
మహేంద్రసింగ్ ధోనీ ఏరీకోరీ తన తర్వాత కెప్టెన్సీకి సరిపోతాడంటూ విరాట్ కోహ్లీకి ముందు టెస్టు ఫార్మాట్ కెప్టెన్‌గా ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా కోహ్లీ పేరును సూచించాడు. ఈ క్రమంలో ధోనీ తర్వాత కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ టాప్ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకుంటోన్న విరాట్. ఒక్క మ్యాచ్‌లోనూ మంచి కెప్టెన్ అనిపించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీని కెప్టెన్‌గా అవసర్లేదంటూ 3 ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా 2013లో ఎంపికైన కోహ్లీ జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేకపోయాడు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి విరాట్ ఇదే జట్టులో కొనసాగుతున్నాడు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ జట్టులో కేవలం పరుగులు మాత్రమే చేయగలడు. ఐపీఎల్‌లోనే అతను 163 మ్యాచ్‌లు ఆడి 4948పరుగులు చేశాడు. మరీ దారుణమైన విషయమేమంటే రెండు సీజన్లుగా ఆర్సీబీ ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోతోంది.

కోహ్లీకి బదులు ఆడిన రోహిత్ శర్మ :
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కెప్టెన్ కోహ్లీకి బదులుగా తాత్కాలిక కెప్టెన్ లంక పర్యటనకు వెళ్లాడు. శ్రీలంక వేదికగా తలపడిన ముక్కోణపు సిరీస్ నిదహాస్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. అంతే కాదు ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలోనూ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అన్ని మ్యాచ్ లలోనూ జట్టును విజేతగా నిలిపి ట్రోఫీని సాధించాడు. ఐపీఎల్ లోనూ కెప్టెన్ గా వ్యవహరించి టైటిల్ సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కోపిష్ఠి కోహ్లీ
కోహ్లీని ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనియాడే అభిమానులు అతణ్ని అత్యుత్తమ కెప్టెన్ అని మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు మైదానంలో ఫీల్డింగ్ విషయంలో గానీ, టాప్ ఆర్ఢర్ బ్యాటింగ్ విషయంలో గానీ స్పష్టత లేకపోవడమే ఇందుకుకారణం. కెప్టెన్‌గా కోహ్లీ తుది జట్టు ఎంపికలో ఒక్క మ్యాచ్‍లోనూ సంతృప్తిపరచలేకపోయాడు. కెప్టెన్‌గా సంయమనం పాటించిన సందర్భాలు చాలా తక్కువ.