టర్నింగ్ పాయింట్ అదే: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన డేవిడ్ వార్నర్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: 'ఒక్క విజయం సాధిస్తే చాలు కోహ్లీసేనకు సవాల్ విసురుతాం' రెండో టీ20కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పిన మాటలివి. తాను చెప్పినట్లే గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. ఈ సిరిస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20 శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. రెండో టీ20లో ఆస్ట్రేలియా సమిష్టిగా రాణించింది. అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేసింది.

రెండో టీ20లో కోహ్లీసేన ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మను నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగేలా చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) జాసన్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఇలా మనీశ్ పాండే రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో స్టేడియంలోని అభిమానులంతా శిఖర్ ధావన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే శిఖర్ ధావన్‌‌ను అద్భుతమై క్యాచ్‌తో డేవిడ్ వార్నర్ పెవిలియన్‌కు పంపాండు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బెహ్రెన్‌డార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న ధావన్‌ దానిని గాల్లోకి లేపాడు. బంతి కోసం చిరుతలా దూసుకెళ్లిన వార్నర్‌ అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో వార్నర్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అప్పటికప్పుడే మైదానంలో వార్నర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, October 11, 2017, 13:19 [IST]
Other articles published on Oct 11, 2017
Please Wait while comments are loading...
POLLS