న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ స్పెషల్స్: 1 బంతికి 22 పరుగులుగా దక్షిణాఫ్రికా టార్గెట్

22 March 1992: Rain saves England in World Cup semi-final

హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే, ఒక్కసారి కూడా ఆ జట్టు వరల్డ్‌కప్ నెగ్గలేదు. ఆ జట్టేదే మరేదో కాదు దక్షిణాఫ్రికా. అయితే, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆ జట్టుని ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

1992 వరల్డ్‌కప్‌లో సరిగ్గా ఇలాంటి దురదృష్ట సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ వరల్డ్ కప్‌లో సఫారీలు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో టైటిల్‌ ఫేవరెట్‌గా కూడా మారింది. టోర్నీ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, భారత్‌, జింబాబ్వేలపై వరుస విజయాలను నమోదు చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది.

టోర్నీ అసాంతం సఫారీలు సూపర్ ఫామ్‌లో

టోర్నీ అసాంతం సఫారీలు సూపర్ ఫామ్‌లో

అలెన్‌ డొనాల్డ్‌, జాంటీ రోడ్స్‌లు సూఫర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే, అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న సఫారీల విజయానికి సెమీస్‌లో ఓ అనూహ్య పరిణామం బ్రేక్ వేసింది. వర్షంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఆ జట్టు సెమీస్‌లో ఓటమిపాలైన చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యం

దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు దక్షిణాప్రికాకు 252 పరుగల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో సఫారీల విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. టోర్నీ అసాంతం దక్షిణాఫ్రికా ఆటగాళ్ల జోరుని చూస్తే పెద్ద లక్ష్యం కూడా కాదు.

1 బంతికి 22 పరుగులు

1 బంతికి 22 పరుగులు

మెక్‌మిలన్‌ (21 నాటౌట్‌), రిచర్డ్‌సన్‌ (13 నాటౌట్‌) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో 12 నిమిషాల పాటు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఈ వర్షం సఫారీల ఓటమికి కారణమైంది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లక్ష్యాన్ని 1 బంతికి 22 పరుగులుగా అంఫైర్లు నిర్దారించారు.

కన్నీటి పర్యంతమైన సఫారీ అభిమానులు

కన్నీటి పర్యంతమైన సఫారీ అభిమానులు

ఇంకేముంది మ్యాచ్‌ ఆడుతున్న బ్యాట్స్ మెన్‌తో పాటు చూస్తున్న అభిమానులు సైతం ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా సఫారీ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరి బంతికి సింగిల్‌ తీసి బ్యాట్స్‌మెన్‌ భారంగా మైదానాన్ని వీడారు. ఇలా వర్షం కారణంగా దురదృష్టం కలిసి రావడంతో సఫారీలు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Story first published: Thursday, May 16, 2019, 12:57 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X