న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గత వరల్డ్‌కప్‌ల్లో మాదిరి దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాదేనా?

ICC Cricket World Cup 2019 : Will Kohli Hit Century This Time ?
2011 and 2015 - Virat Kohli has kicked-off his tournaments in style with centuries

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎందుకంటే... గత రెండు వరల్డ్‌‌కప్‌ల్లో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌ల్లో కోహ్లీ సెంచరీలు సాధించి ఉండటమే. 2011 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మిర్‌పుర్ వేదికగా జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో కోహ్లీ 83 బంతల్లో సెంచ‌రీ చేశాడు. ఆ తర్వాత 2015 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ పాకిస్థాన్‌తో అడిలైడ్ వేదికగా జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లో 126 బంతుల్లో కోహ్లీ సెంచ‌రీ బాదాడు.

టీమిండియాదే విజయం

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం సఫారీలతో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. ఈ రెండింటిలోనూ ఓడిపోయింది.

మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో

మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో

దీంతో మూడో మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే, ఆ జట్టులోని కీలక ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ వరల్డ్‌కప్‌లో మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అడినప్పటికీ... భారత్ మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ ఆడలేదు.

దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్

దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్

భారత్‌ బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. భారత్‌కు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. దక్షిణాఫ్రికాకు మూడో మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌ ఆలస్యంకు అసలు కారణం బీసీసీఐనే అట. ఐపీఎల్ 2019 సీజన్‌తో దాదాపు నెలన్నర పాటు టీమిండియా క్రికెటర్లు విశ్రాంతి లేకుండా ఆడారు.

కోహ్లీసేన ఆలస్యానికి కారణం

కోహ్లీసేన ఆలస్యానికి కారణం

అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడారు. తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ భావించింది. ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ స్వయంగా ఐసీసీని కోరింది. దీంతో టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్‌ను రూపొందించింది.

జట్ల వివరాలు (అంచనా)

జట్ల వివరాలు (అంచనా)

భారత్‌: శిఖర్‌ ధవన్‌, రోహిత్‌, కోహ్లీ (కెప్టెన్‌), రాహుల్‌, ధోనీ, జాదవ్‌/విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

దక్షిణాఫ్రికా: డికాక్‌, ఆమ్లా, మార్‌క్రమ్‌, డుప్లెసిస్‌, వాన్‌డర్‌ డుస్సెన్‌, డుమిని, ఫెలుక్వాయో, మోరిస్‌, ప్రిటోరియస్‌, రబాడ, తాహిర్‌.

Story first published: Wednesday, June 5, 2019, 14:06 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X