న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో భారత్-వెస్టిండిస్ మ్యాచ్:10 ఆసక్తికర విషయాలు, గేల్ దూకుడుని అడ్డుకుంటారా?

By Nageswara Rao

పెర్త్: ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బీలో భాగంగా శుక్రవారం పెర్త్‌లో జరగనున్న భారత్-వెస్టిండిస్ మ్యాచ్‌లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నాం 12 గంటలకు ప్రారంభం కానుంది.

ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్ధాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై టీమిండియా విజయం సాధించింది. భారత్, ఐర్లాండ్, ఐసీసీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.

క్రిస్ గేల్, డివిల్లియర్స్ వంటి వారు చితక్కొడితే తాము ఏమీ చేయలేమని, అందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు ఉండవని భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో.. గేల్ దూకుడు కనిపిస్తుందా లేదా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అతని దూకుడుకు ధోనీ సేన అడ్డుకట్ట వేస్తుందా చూడాలి.

10 facts about India-West Indies match in Perth

అధ్బుతమైన ఫామ్‌లో టీమిండియా గేల్ ఫోర్స్‌ని ఏ విధంగా ఆపుతుందనేది క్రికెట్ అభిమానుల మనసులో పెద్ద ప్రశ్నగా మిగిలింది. వరల్డ్ కప్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జింబాబ్వేపై విరుచుకపడి డబుల్ సెంచరీని సాధించాడు.

శుక్రవారం పెర్త్‌లోని వాకా గ్రౌండ్‌లో వెస్టిండిస్‌తో భారత్ తలపనున్న సందర్భంలో కొన్ని ఆసక్రికర విషయాలు అభిమానుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

1. ఐసీసీ వరల్డ్ కప్‌లో భారత్-వెస్టిండిస్‌లు తలపడటం ఇది 8వసారి. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌ల్లో గెలవగా, వెస్టిండిస్ మూడింట్లో గెలిచింది.

2. ఇరు జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుగా కపిన్ దేవ్ (భారత్), వెస్టిండిస్ (దేశ్‌మాండ్ హెయిన్స్) ఉన్నారు. ఇద్దరు కూడా 1979 నుంచి 1992 వరకు 5 మ్యాచ్‌ల్లో భారత్, వెస్టిండిస్ తరుపున ప్రాతినిధ్యం వహించారు.

3. 1979 వరల్డ్ కప్‌లో తొలిసారి భారత్-వెస్టిండిస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

4. వరల్డ్ కప్‌లో భారత్-వెస్టిండిస్ తలపడిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు 197 సాధించిన ఆటగాడి రికార్డు వివిన్ రిచర్డ్స్ (4 ఇన్నింగ్స్, 1 సెంచరీ) పేరిట ఉంది. 4 ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు తీసుకుని మైఖెల్ హొల్డింగ్ అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు.

10 facts about India-West Indies match in Perth

5. వెస్టిండిస్ జట్టు తరుపున 2 సెంచరీలు నమోదయ్యాయి ( 1979లో గోర్డాన్ గ్రీన్డిడ్జ్ - 106, 1983లో వివిన్ రిచర్డ్స్ - 119). భారత్ తరుపున ఒకే ఒక సెంచరీ నమోదైంది. 2011 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ - 113 పరుగులు చేశాడు.

6. వరల్డ్ కప్‌లో వెస్టిండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు మొహిందర్ అమర్నాధ్ - 135( 4 ఇన్నింగ్స్, అత్యధిక స్కోరు 80 పరుగులు). ఇక ఎక్కువ వికెట్లు తీసుకున్న ఆటగాడు రోజర్ బిన్నీ - 7 (3 ఇన్నింగ్స్, బెస్ట్ 3/48).

7. వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌పై అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యం గోర్డాన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్‌లు 1979లో 138 నెలకొల్పారు. 10వ వికెట్ భాగస్వామ్యానికి ఆండీ రాబర్ట్స్-జోయెల్ గార్నర్‌లు నెలకొల్పిన 71 పరుగులు భాగస్వామ్యం కూడా రికార్డే.

8. సర్ వివిన్ రిచర్డ్స్ భారత్‌పై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో చెలరేగిపోయి ఆడేవాడు. 1983 వరల్డ్ కప్‌లో 3 ఇన్నింగ్స్‌లో 169 పరుగులు చేశాడు.

9. 1983 లార్డ్స్ మైదానంలో వెస్టిండిస్‌పై గెలుపొందడం ద్వారానే టీమిండియా వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది.

10. ఇప్పటి వరకు వెస్టిండిస్‌తో జరిగిన 7 మ్యాచ్‌ల్లో ఏడుగురు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నారు.


( ఇప్పటి వరకు మొత్తం ఆడింది 7, భారత్ గెలిచింది-4, వెస్టిండిస్ గెలిచింది-3):

* 2011- 80 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - యువరాజ్ సింగ్)

* 1996 - 5 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - సచిన్ టెండూల్కర్)

* 1992 - 5 వికెట్ల తేడాతో వెస్టిండిస్ గెలిచింది (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - ఆండర్సన్ కుమ్మిన్స్)

* 1983 - ఫైనల్ - 43 పరుగుల తేడాతో భారత్ గెలిచింది (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - మొహిందర్ అమర్నాధ్)

* 1983 - లీగ్ మ్యాచ్ - 66 పరుగుల తేడాతో వెస్టిండిస్ గెలిచింది (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - వివిన్ రిచర్డ్స్)

* 1979 - 9 వికెట్ల తేడాతో వెస్టిండిస్ గెలిచింది (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - గోర్డాన్ గ్రీనిడ్జ్)

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X