న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: 'గెలుపు కూడా పాఠాలు నేర్పిస్తుంది'

By Nageshwara Rao
There cant be a better teacher than setbacks: Shiva Thapa

హైదరాబాద్: విజయాలు కీర్తిని సంపాదించిపెడతాయి కానీ మనం ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు మాత్రం జీవిత పాఠాలను నేర్పుతాయని భారత బాక్సర్‌ శివ థాపా అన్నాడు. ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాడు.

ఏకైక భారత బాక్సర్‌ శివ థాపానే

ఏకైక భారత బాక్సర్‌ శివ థాపానే

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా మూడు పతకాలు.. స్వర్ణం (2013), కాంస్యం (2013), రజతం (2017) నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌ శివ థాపానే. అలాంటి శివ థాపా ఖాతాలో ఒక్క ఆసియా గేమ్స్ పతకం కూడా లేదు. దీంతో ఆగస్టు 18 నుంచి ఆరంభమయ్యే ఆసియా గేమ్స్‌లో సత్తా చాటుతానని అంటున్నాడు.

ఎదురుదెబ్బలు విలువైన పాఠాలు నేర్పుతాయి

ఎదురుదెబ్బలు విలువైన పాఠాలు నేర్పుతాయి

గత ఆసియా గేమ్స్‌లో శివ థాపా క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంటిదారి పట్టిన శివ థాపా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ‘‘ఎదురుదెబ్బలు విలువైన పాఠాలు నేర్పుతాయి. అవి మనల్ని బలంగా తీర్చిదిద్దుతాయి. తిరిగి పుంజుకొని సత్తా చాటినప్పుడు కలిగే భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విజయాలు కీర్తిని సాధించి పెట్టడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి" అని అన్నాడు.

గెలుపు కూడా పాఠాలు నేర్పిస్తుంది

గెలుపు కూడా పాఠాలు నేర్పిస్తుంది

"కానీ ఓటములు బలంగా లాగిన వింటినారి లాంటివి. ఎంత వెనక్కి లాగితే అంత వేగంతో దూసుకెళ్లవచ్చు. గెలుపు కూడా పాఠాలు నేర్పిస్తుంది కానీ ఎదురుదెబ్బలు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా రోజుల కష్టం తర్వాత మన ఉత్తమ ప్రదర్శనకు లభించిన ఫలితాన్ని విజయం అని అంటాను" అని థాపా తెలిపాడు.

మెరుగ్గా బాక్సింగ్‌ చేయాలనుకుంటా

మెరుగ్గా బాక్సింగ్‌ చేయాలనుకుంటా

"ఇదివరకు కనబరిచిన ఉత్తమ ప్రదర్శన కంటే మెరుగ్గా బాక్సింగ్‌ చేయాలనుకుంటా. విజయాలు సాధించినా, పరాజయాలు ఎదురైనా చాలా మంది దూరం నుంచి చాలా మాట్లాడతారు. ఆసియా గేమ్స్ నాకెంత ప్రత్యేకమైనవి చెప్పలేను. గొప్ప సవాల్ ఎదురు కాబోతుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నా. 2016లో 60 కేజీల విభాగానికి మారిన తర్వాత పోటీపడబోయే టోర్నీ ఇదే" అని అన్నాడు.

Story first published: Monday, August 6, 2018, 12:54 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X