న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశలు అడియాసలు: ట్రయల్స్‌లో మేరీకోమ్‌ చేతిలో నిఖత్ జరీన్ ఓటమి

Mary Kom defeats Nikhat Zareen, to represent India in Tokyo Olympics

హైదరాబాద్: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ చేతిలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఓటమిపాలైంది. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన 51 కేజీల విభాగంలో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్‌ జరీన్‌పై గెలు పొందింది.

ఈ విజయంతో మేరీకోమ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించింది. "ఎట్టకేలకు మేరీతో తలపడే అవకాశం దక్కింది. ఇది మరపురాని పోరుగా నిలిచేలా చూస్తా. నిజాయితీగా ఆడతా" అన్న నిఖత్‌ జరీన్‌ ఆశలు అడియాసలే అయ్యాయి.

వికెట్ తీసిన ఆనందంలో పూజారా: శిఖర్ ధావన్ ఫన్నీ కామెంట్వికెట్ తీసిన ఆనందంలో పూజారా: శిఖర్ ధావన్ ఫన్నీ కామెంట్

ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్‌ తన ప్రత్యర్ధి నిఖత్ జరీన్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించింది. చివరి వరకు పూర్తి ఆధిపత్యం కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంది. 51 కేజీలో విభాగంలో టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం చెలరేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది.

గతంలో మేరీ కోమ్ వేరే విభాగంలో తలపడేది. అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె 51 కిలోల విభాగానికి మారింది. దీంతో అదే విభాగంలో పోటీపడుతున్న జరీన్‌కు ఒలింపిక్స్‌కు అవకాశం లేకుండా పోయింది. అనుభవశాలి మేరీకోమ్‌‌ను ట్రయల్స్‌తో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్‌కు పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.

మహిళా ఉద్యోగితో ఢిల్లీ అండర్-23 క్రికెటర్ల అసభ్య ప్రవర్తన: వేటు వేసిన డీడీసీఏమహిళా ఉద్యోగితో ఢిల్లీ అండర్-23 క్రికెటర్ల అసభ్య ప్రవర్తన: వేటు వేసిన డీడీసీఏ

దీంతో భారత బాక్సింగ్ సమాఖ్యలో వివాదం మొదలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్‌ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రికి ట్విట్టర్ వేదికగా లేఖ రాసింది. దీంతో శనివారం వీరిద్దరి మధ్య నిర్వహించిన ట్రయల్స్‌లో నిఖత్ జరీన్ ఓడిపోయింది.

మరో పోరులో రెండుసార్లు ప్రపంచ రజత పతక విజేత సోనియా లాథర్‌ (57 కిలోలు)ను సాక్షి చౌదరీ ఓడించింది. ఇక, 60 కిలోల విభాగంలో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సరితా దేవి... సిమ్రన్‌జీత్‌ కౌర్‌ చేతిలో ఓటమిపాలైంది.

Story first published: Saturday, December 28, 2019, 14:36 [IST]
Other articles published on Dec 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X