న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశం గర్వించేలా చేశావ్: స్వర్ణం నెగ్గిన బాక్సర్ జరీన్‌పై ఎంపీ కవిత ప్రశంసలు

By Nageshwara Rao
Kavitha lauds Belgrade boxing gold winner boxer Nikhat Zareen

హైదరాబాద్: ఇటీవలే బెల్‌గ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు. పతకంతో సత్తాచాటి స్వదేశం చేరుకున్న నిఖత్.. బుధవారం హైదరాబాద్‌లో ఎంపీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎంపీ కవితను నివాసంలో కలిసిన జరీన్

ఎంపీ కవితను నివాసంలో కలిసిన జరీన్

కుటుంబ సభ్యులతో కలసి కవిత నివాసానికి వెళ్లిన జరీన్.. తాను సాధించిన బంగారు పతకాన్ని ఆమెకు చూపించారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత బాక్సర్లు మొత్తం 13 పతకాలు సాధించారు. 51 కేజీల మహిళల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలుచుకుంది.

దేశానికి గర్వకారణమన్న ఎంపీ కవిత

దేశానికి గర్వకారణమన్న ఎంపీ కవిత

ఈ సందర్భంగా అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణ పతకం సాధించడం నిజామాబాద్ జిల్లాకే గాకుండా రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని కవిత అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దీనికి నిఖత్ జరీన్ ఉదాహరణ అని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరెన్నో విజయాలు సొంతం చేసుకొని రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు.

 నిజామాబాద్‌కు చెందిన వారు కావడం సంతోషం

నిజామాబాద్‌కు చెందిన వారు కావడం సంతోషం

జరీన్‌తో పాటు ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన నిజామాబాద్ బాక్సర్ హుస్సాముద్దీన్‌పై ఈ సందర్భంగా కవిత ప్రశంసించారు. వీరిద్దరూ నిజామాబాద్‌కు చెందిన వారు కావడం ఆ పట్టణ వాసులకు సంతోషకరమైన విషయమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు.

ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు

వీటిని ఉపయోగించుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి పర్చుకోవాలని సూచించారు. నిఖత్ జరీన్‌కు తన వంతుగా, అలాగే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానన్నారు. కాగా, 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ వరకు జరిగింది. ఈ పోటీల్లో భారత బాక్సర్లు మూడు బంగారు, ఐదు రతజం, ఐదు కాంస్య పతకాలు సాధించారు.

Story first published: Thursday, May 3, 2018, 13:18 [IST]
Other articles published on May 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X