న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: రింగ్‌ వద్ద బాక్సర్‌ నిరసన.. కారణం ఏంటంటే?

France boxer Mourad Aliev protests at boxing ring for an hour in Tokyo Olympics 2021

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021లో ఆదివారం ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్దే కూర్చుని తన నిరసన తెలిపాడు. ఈరోజు ఉదయం బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడిన సందర్భంగా.. మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్‌లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపర్చడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు.

Tokyo Olympics 2021: కచనోవ్‌పై సంచలన విజయం.. గోల్డ్ గెలిచిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌!!Tokyo Olympics 2021: కచనోవ్‌పై సంచలన విజయం.. గోల్డ్ గెలిచిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌!!

పలుమార్లు తలతో దాడి:

పలుమార్లు తలతో దాడి:

తొలి రౌండ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌పై మౌరాద్‌ అలీవ్‌ ఆధిపత్యం చెలాయించాడు. ఐదుగురు న్యాయనిర్ణేతల స్కోర్లలో మౌరాద్‌కే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అయితే రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడిన క్లర్క్‌, మౌరాద్‌ హోరాహోరీ తలపడ్డారు. ఈ క్రమంలోనే మౌరాద్‌ ప్రత్యర్థి క్లర్క్‌పై పలుమార్లు తలతో దాడి చేశాడు. దీంతో క్లర్క్‌కు గాయాలయ్యాయి. రిఫరీ అతడిని ఆపేందుకు ప్రయత్నించినా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై న్యాయనిర్ణేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనుకునే సమయంలో మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో అనర్హత వేటు వేశాడు.

 రింగ్‌ వద్ద కూర్చొని:

రింగ్‌ వద్ద కూర్చొని:

తనపై అనర్హత వేటు పడడంతో ఫ్రాన్స్‌ బాక్సర్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్ద కూర్చొని నిరసన తెలిపాడు. అనంతరం ఫ్రాన్స్‌ టీమ్‌ అధికారులు వచ్చి అతడితో మాట్లాడాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే 15 నిమిషాల తర్వాత మళ్లీ తిరిగొచ్చి.. అక్కడే కూర్చొని తన అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌.. ఆ సమయంలో తాను మౌరాద్‌ను స్థిమితంగా ఉండమని చెప్పినట్లు తెలిపాడు. అతడు తనపై దాడి చేశాడని, అది ఉద్దేశపూర్వకమో లేకా అలా జరిగిపోయిందో తెలియదని చెప్పాడు. ఏదైనామైనా క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని క్లర్క్‌ అభిప్రాయపడ్డాడు.

 1988లోనూ ఇలానే:

1988లోనూ ఇలానే:

1988 సియోల్‌ ఒలింపిక్స్‌లోనూ ఇంచుమించు ఇలాంటి ఓ అసక్తికరమైన నిరసననే చోటుచేసుకుంది. అప్పుడు దక్షిణా కొరియా బాక్సర్‌ బైయున్‌ జంగ్‌ ఇల్‌పై రెండు పెనాల్టీ పాయింట్లు విధించడంతో అతడు నిరసన తెలిపాడు. అప్పుడతడు సుమారు గంటపైనే రింగ్‌లో అలాగే ఉండిపోయి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఇప్పుడు అదే బాక్సింగ్‌ ఈవెంట్‌లో మరోసారి ఇంకో బాక్సర్‌ నిరసన తెలపడం గమనార్హం. అయితే ఈసారి ఫ్రాన్స్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్ద 60 నిమిషాల పాటు ఉన్నాడు.

Story first published: Sunday, August 1, 2021, 18:01 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X