కామన్వెల్త్: తండ్రి పాత గ్లౌవ్స్‌ అతడిని పతకం వైపు నడిపించాయి

Posted By:
Dads old boxing gloves propel Canadian to medal glory

హైదరాబాద్: తండ్రి గ్లౌవ్స్‌ ధరించి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఓ బాక్సర్ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కెనడాకు చెందిన ఏళ్ల థామస్‌ బ్లుమెన్‌ఫీల్డ్‌కు నాన్న బాబ్‌ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తండ్రిని ఎంతో ప్రేమించాడు. తండ్రితో పాటు బాక్సింక్ క్రీడను కూడా ఫాలో అయ్యేవాడు.

కామన్వెల్త్: స్వర్ణం గెలిచిన మేరీకోమ్, శనివారం 3 స్వర్ణాలు, 2 రజతాలు

ఓ బౌట్‌లో తన తండ్రి చేయి విరగడంతో బాక్సింగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. దీంతో తన తండ్రి బాక్సింగ్‌ గ్లౌవ్స్‌కు ఇచ్చే విలువేంటో తెలుసుకున్న థామస్‌ అవే బాక్సింగ్‌ గ్లౌవ్స్‌ తన 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దాచి పెట్టుకున్నాడు. ఇప్పుడు గోల్ట్ కోస్ట్‌లో తండ్రి గ్లోవ్స్‌తో బరిలోకి దిగి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

లైట్‌ వెల్టర్‌ వెయిట్‌లో ఫైనల్‌ చేరిన అతను ఇప్పుడు స్వర్ణ పతకం వేటలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో థామస్‌ వెంట లేకపోయినప్పటికీ బాబ్‌ మాత్రం టీవీలో తన తనయుడి విజయాన్ని తనివితీరా ఆస్వాదించి ఉంటాడు.

తన విజయంపై థామస్‌ మాట్లాడుతూ 'నాకు బాక్సింగ్‌ కంటే నాన్నంటేనే ఇష్టం. నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఓ బాక్సింగ్ గ్లౌవ్స్ జత కనిపించింది. అప్పుడే నాన్నతో చెప్పా నేను బాక్సింగ్ నేర్చుకంటానని. ఆయన బాక్సింగ్‌ కాకుండా టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్‌ ఏది ఆడినా నేను దాన్నే అనుసరించేవాణ్ని' అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 14, 2018, 12:05 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి