న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాన్న ఎప్పుడూ మేం బాక్సర్లు కావాలని కోరుకోలేదు

Dad never wanted us to be boxers: Muhammad Alis daughter

హైదరాబాద్: బాక్సింగ్‌ గ్రేట్ మహమ్మద్‌ అలీ తన పిల్లలు బాక్సర్లు కావాలని ఎన్నడూ కోరుకోలేదని ఆయన కుమార్తె హనా అలీ వెల్లడించింది. తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని ఆయన ఎప్పుడూ ప్రార్థిస్తారని, అందుకే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోమని చేప్పేవారని హనా చెప్పింది.

వరుసగా ఆరో ఏడాది: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మవరుసగా ఆరో ఏడాది: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

తాజాగా, మహమ్మద్ అలీ జీవిత విశేషాల ఆధారంగా రాసిన "ఎట్‌ హోమ్‌ విత్‌ మహమ్మద్‌ అలీ" అనే పుస్తకంలోని విశేషాలను హనా అలీ పంచుకుంది. ఈ సందర్భంగా తన సోదరి లైలా బాక్సర్‌ కావాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసినప్పుడు ఆయన అయిష్టంగానే ఆమెకు పూర్తి సహకారం అందించారని చెప్పింది.

మహమ్మద్‌ అలీ జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అయినప్పటికీ తాజా పుస్తకం అలీ అభిమానులతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకమని ఆమె తెలిపారు. అమెరికాకు చెందిన మహమ్మద్‌ అలీ 20వ దశకంలో పాపులర్ స్పోర్ట్స్‌పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

1942లో జన్మించిన మహమ్మద్‌ అలీ 2016లో కన్నుమూశారు. మహమ్మద్‌ అలీ తన కెరీర్‌లో మొత్తం 61 బాక్సింగ్ ఫైట్లలో పాల్గొనగా 56 ఫైట్లలో విజయం సాధించారు.

View this post on Instagram

The Times ( Online ) UK #muhammadali

A post shared by Hana Ali (@hanayali) on

Story first published: Monday, October 22, 2018, 15:30 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X