న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Thomas and Uber Cup 2022 : క్వార్టర్ ఫైనల్‌కు ముందు పీవీ సింధు సహా వుమెన్స్ టీం దారుణ పరాజయం

Thomas and Uber Cup 2022 : Team India Badminton Womens team loses last match in Group Stage

బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ ఉబెర్ కప్ - 2022లో బుధవారం జరిగిన చివరి గ్రూప్ క్లాష్‌లో టీమిండియా వుమెన్స్ టీం దక్షిణా కొరియాపై 5-0 తేడాతో పరాజయం పాలైంది. వరుసగా రెండు విజయాలను నమోదు చేసిన తర్వాత దక్షిణ కొరియాపై గ్రూప్ డి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు పూర్తిగా నిరాశపరిచారు. ప్రపంచ నంబర్ 7 పీవీ సింధు సైతం ఓడిపోవడం కాస్త ఆందోళన కలిగించింది. వరుసగా రెండు సెట్లలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన దక్షిణా కొరియా ప్లేయర్ యాన్ సే-యంగ్ పీవీ సింధును ఓడించింది. 42నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 15-21, 14-21తేడాతో ఓడిపోయింది.

ఇక రెండో మ్యాచ్‌లో మహిళల డబుల్స్ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రాన్ సింఘీ జోడీ టీమిండియా తరఫున తలపడగా.. 39నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో 13-21, 12-21తో లీ సో-హీ-షిన్ సెంగ్-చాన్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో కిమ్ గా-యున్‌తో 10-21, 10-21 పాయింట్ల తేడాతో ఆకర్షి కశ్యప్ ఓడిపోయింది. ఆ తర్వాత 36నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ 14-21, 11-21తో కిమ్ హే-జియాంగ్-కాంగ్ హీ-యోంగ్ చేతిలో ఓడిపోయారు. ఇక చివరి పోరులో.. అష్మితా చలిహా సిమ్ యు-జిన్‌తో తలపడింది. అష్మితా 18-21, 17-21తేడాతో ముగించడంతో భారత్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడి గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసింది.

ఇక ఇంతకుముందు టీమిండియా కెనడా, అమెరికాలపై వరుసగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో థామస్ ఉబెర్ కప్ 2022యొక్క క్వార్టర్ ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఇప్పటికే టీమిండియా వుమెన్స్ టీం రిజర్వ్ చేసుకుంది. ఇక మెన్స్ టీం కూడా ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇక రేపు క్వార్టర్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్ టీం థాయ్‌లాండ్‌తో తలపడనుంది. మరో వైపు మెన్స్ టీం క్వార్టర్ ఫైనల్‌కు సంబంధించిన డ్రా నేటి సాయంత్రం తీస్తారు. రేపు మధ్యాహ్నం క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది.

Story first published: Wednesday, May 11, 2022, 16:52 [IST]
Other articles published on May 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X