న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధూకు అడుగు నేల కూడా ఇవ్వం: తెలంగాణ ప్రభుత్వం

Telangana announces cash rewards, PV Sindhu out of list

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి ఇక హైదరాబాద్‌లో అదనంగా గజం స్థలాన్ని కూడా ఇచ్చేదిలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం గెలవడంతో అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించాయి.

ప్రోత్సహకాల్లో భాగంగా పీవీ సింధుకి తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లోని భరణి లేఅవుట్స్‌లో 1000 గజాల స్థలం కేటాయించింది. దీంతో పాటు రూ. 5 కోట్ల నగదు బహుమతిని కూడా అప్పట్లో అందజేసింది. అయితే.. తనకు ఇచ్చిన భూమి పక్కనే ఉన్న 398 గజాల స్థలం కూడా కావాలంటూ ఆమె కొన్నాళ్ల క్రితం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఈ అభ్యర్థనని ప్రభుత్వం తిరస్కరించింది. కాగా ఆమె విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థలం, నగదు బహుమతితో పాటు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది.

రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందిన నేపథ్యంలో ఆమెకు అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం కార్యాలయం భావించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీవీ సింధుకి రూ.3 కోట్ల నగదు, రాజధానిలో 1000 గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రస్తుతం ఆడుతున్న సింధు.. గురువారం క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. హాంకాంగ్ క్రీడాకారిణి యిన్‌ యిప్‌పై సింధు 21-16, 21-14 తేడాతో వరుస సెట్లలో గెలుపొంది టోర్నీలో ముందజ వేసింది.

Story first published: Friday, July 13, 2018, 12:39 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X