న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విస్ ఓపెన్: నిరాశ పరిచిన సాయిప్రణీత్‌, రన్నరప్‌తో సరి

Swiss Open: Sai Praneeth Takes Home Silver After Losing To Chinas Shi Yuqi In Final

హైదరాబాద్: స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాయిప్రణీత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో వరల్డ్ 22వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21-19, 18-21, 12-21తో టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

ధోని లేకపోవడం వల్లే ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీసేన ఓటమి: పాంటింగ్ధోని లేకపోవడం వల్లే ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీసేన ఓటమి: పాంటింగ్

గంటా ఎనిమిది నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో తొలిగేమ్‌‌లో విజయం సాధించిన సాయిప్రణీత్‌ చివరిదాకా అదే జోరు కొనసాగించలేకపోయాడు. తొలిగేమ్‌లో 7-4తో యుకి ఆధిక్యంలో ఉన్న దశలో సాయి ప్రణీత్‌ అనూహ్యంగా పుంజుకుంటూ 9-9తో స్కోరు సమం చేశాడు. అదే జోరులో 11-9తో బ్రేక్‌కు వెళ్లిన ప్రణీత్‌.. ఆ తర్వాత దూకుడు పెంచాడు.

అద్భుతమైన డ్రాప్‌ షాట్‌తో

అద్భుతమైన డ్రాప్‌ షాట్‌తో

ఓ అద్భుతమైన డ్రాప్‌ షాట్‌తో ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే మరో మూడు పాయింట్లతో 18-12కు ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ దశలో కళ్లు చెదిరే స్మాష్‌లతో చెలరేగిన చైనీస్ ప్లేయర్ వరుసగా పాయింట్లు సాధిస్తూ 19-19తో స్కోరును సమం చేశాడు. దీంతో వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు.

7-4తో ఆధిక్యం చాటుకున్న ప్రణీత్‌

7-4తో ఆధిక్యం చాటుకున్న ప్రణీత్‌

ఇక, రెండోగేమ్‌ ఆరంభంలో 7-4తో ఆధిక్యం చాటుకున్న ప్రణీత్‌కు చెక్‌పెడుతూ షి యుకి వరుసగా ఏడు పాయింట్లు కొల్లగొట్టి 11-7తో ముందుకెళ్లాడు. విరామం తర్వాతా అదేజోరు చూపిన చైనా షట్లర్‌ అదే జోరులో 18-21తో రెండోగేమ్‌ సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక గేమ్‌లో ప్రణీత్‌ పదేపదే పొరపాట్లు చేసి 12-21తో ఆ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు.

ఫైనల్‌ చేరడం ప్రణీత్‌కిదే తొలిసారి

ఫైనల్‌ చేరడం ప్రణీత్‌కిదే తొలిసారి

2017లో స్విస్‌ ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ తర్వాత అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌ చేరడం ప్రణీత్‌కిదే తొలిసారి కావడం విశేషం. విజేత షి యుకికి 11,250 డాలర్లు (రూ. 7 లక్షల 75 వేలు)... రన్నరప్‌ సాయిప్రణీత్‌కు 5,700 డాలర్లు (రూ. 3 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.

సాయి ప్రణీత్ మాట్లాడుతూ

సాయి ప్రణీత్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం సాయి ప్రణీత్ మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత నా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో రెండో గేమ్‌లో కీలకదశలో రెండేసి పాయింట్ల చొప్పున కోల్పోవడం మలుపు తిప్పింది. సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌పై సాధించిన గెలుపు నా కెరీర్‌లోని గొప్ప విజయాల్లో ఒకటి" అని అన్నాడు.

Story first published: Monday, March 18, 2019, 12:37 [IST]
Other articles published on Mar 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X