న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరించిన కిదాంబి శ్రీకాంత్

By Nageshwara Rao
Shuttler Kidambi Srikanth takes charge as Deputy Collector in Andhra Pradesh

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ కోన శశిధర్‌ని కలిసి తన నియామకపత్రాన్ని అందజేశాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌గా 72 వారాల శిక్షణ కూడా స్వస్థలమైన గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.

బ్యాడ్మింటన్‌లో మరింతగా రాణించి దేశానికి, రాష్ట్రానికి మరింత ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. శ్రీకాంత్‌ వెంట నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

సాత్విక్‌కు రూ.40 లక్షల నజరానా
కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం సాత్విక్‌ సాయిరాజ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.40 లక్షల బహుమతి అందిస్తామని ప్రకటించారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్‌ బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కామన్వెల్త్‌ క్రీడల్లో తాను సాధించిన పతకాలను చూపించాడు. ఈ సందర్భంగా చంద్రబాబు అతడిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు.

Story first published: Thursday, May 3, 2018, 11:46 [IST]
Other articles published on May 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X