సైనా ఇంట్లో శ్ర‌ద్ధా: ఆతిథ్యం అదిరింది (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఇటీవ‌ల 'సాహో' షూటింగ్ భోజ‌న స‌మ‌యంలో బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌కి ప్ర‌భాస్ ఆంధ్రా రుచుల్ని ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సైనా నెహ్వాల్ కుటుంబం కూడా శ్ర‌ద్ధా క‌పూర్‌కి వారి వంట‌కాల‌ను రుచి చూపించింది.

సైనా బయోపిక్‌లో శ్ర‌ద్ధా క‌పూర్‌

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా బ‌యోపిక్‌లో ఆమె పాత్రను శ్ర‌ద్ధా క‌పూర్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సైనా ద‌గ్గ‌ర శ్ర‌ద్ధా కొన్ని మెల‌కువ‌లు నేర్చుకుంటోంది. అందులో భాగంగా శుక్ర‌వారం శ్ర‌ద్ధా క‌పూర్, సైనా ఇంటికి వెళ్లింది.

సైనా త‌ల్లి గారాబం చేసింది

ఇందుకు సంబంధించి ఫోటోలను ఆమె తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. సైనా త‌ల్లి త‌న‌ను చాలా గారాబం చేసింద‌ని, పూరీ, చోళే, ఖీర్‌, హ‌ల్వాల‌ను రుచి చూపించింద‌ని శ్ర‌ద్ధా కపూర్ చెప్పుకొచ్చింది.

కూతురు సాధించిన పతకాలను గర్వపడుతూ

అదేవిధంగా సైనా తండ్రి, కూతురు సాధించిన ప‌త‌కాల‌ను చాలా గ‌ర్వ‌ప‌డుతూ చూపించార‌ని పేర్కొంది.

త‌మ పెంపుడు కుక్క చాప్సీతో

అంతేకాదు సైనా నెహ్వాల్ ఒలింపిక్ పతకాన్ని కూడా ఆమె తన పోస్టులో పెట్టింది. అదేవిధంగా శ్ర‌ద్ధా క‌పూర్, త‌మ పెంపుడు కుక్క చాప్సీతో ఆడుకుంటున్న వీడియోను సైనా నెహ్వాల్ షేర్ చేసింది.

Story first published: Sunday, September 17, 2017, 10:42 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి