న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థాయ్‌లాండ్‌ ఓపెన్‌.. చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

Satwiksairaj Chirag Shetty defeated reigning Li Jun Hui, Liu Yu Chen to win their maiden

బ్యాంకాక్‌: భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిల జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్స్‌ లీ జున్‌ హూ- యు చెన్‌ (చైనా )ను సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓడించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చైనా షట్లర్లును భారత్‌ జోడీ 21-19, 18-21, 21-18 తేడాతో మట్టికరిపించింది.

సై'నీ' అరంగేట్ర మ్యాచ్‌ చూసి వారిద్దరి మిడిల్‌ స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి: గంభీర్సై'నీ' అరంగేట్ర మ్యాచ్‌ చూసి వారిద్దరి మిడిల్‌ స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి: గంభీర్

ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టోర్నీ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ గెలిచిన తొలి భారత జోడీగా సాత్విక్‌-చిరాగ్‌ జంట చరిత్ర సృష్టించింది. తొలిగేమ్‌ విరామ సమయానికి 11-9తో భారత్‌ జోడీ పైచేయి సాధించింది. కానీ ఈ సమయంలో చైనా షటర్లు విజృంభించి 18-18తో స్కోరు సమం చేశారు. భారత జోడీ గట్టిగా పోరాడడంతో తొలి గేమ్‌ను 21-19తో కైవసం చేసుకుంది.

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో విక్రమ్‌ రాథోడ్‌టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో విక్రమ్‌ రాథోడ్‌

రెండో గేమ్‌ను సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 4-1తో ఆరంభించినా.. చైనా షట్లర్ల ముందు తలవంచింది. అనవసర తప్పిదాలు చేసి చివరకు రెండో గేమ్‌ను 18-21తో కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత్‌ జోడీ అంచనాలకు మించి రాణించి చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టింది. సుదీర్ఘ ర్యాలీలో ఆకట్టకున్న సాత్విక్‌ జోడీ చివరకు 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ చరిత్ర సృష్టించింది.

Story first published: Sunday, August 4, 2019, 16:41 [IST]
Other articles published on Aug 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X