న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమకు టైం లేదు, సల్మాన్ పర్‌ఫెక్ట్: ఆసక్తికర విషయాలు వెల్లడించిన సైనా

హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతోపాటు ఆటకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ప్రేమించేంత టైం లేదని తెలిపారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ఒక వేళ తను బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కాకుంటే?.. వైద్యురాలిని అయ్యేదాడ్ని అని సైనా నెహ్వాల్‌గా తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో తాను బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఆటపై ఆసక్తి పెరిగి మంచి శిక్షణ, దానికి తగిన వాతావరణం కల్పించుకున్నానని తెలిపారు. దాని ఫలితంగానే బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా మీముందున్నానని చెప్పారు.

మూడవ తరగతి పూర్తయ్యే వరకు యావరేజ్‌ స్టూడెంట్‌నేనని చెప్పిన సైనా.. 30 మంది ఉన్న తరగతిలో 10 నుంచి 15 ర్యాంకు వచ్చేదని తెలిపారు. తన అదృష్టమేమిటంటే తొమ్మిదేళ్ల వయసులో శాశ్వతంగా హైదరాబాద్‌లో సెటిల్‌ కావడమేనని తెలిపారు.

బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్న తర్వాత ఆరిఫ్‌ సర్‌ శిక్షణలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ఎదిగానని సైనా చెప్పారు. బ్యాడ్మింటన్‌ నేర్చుకోవాలనుకునే వారికి హైదరాబాద్‌ బెస్ట్‌ ఆప్షన్‌ స్పష్టం చేశారు. 16 సంవత్సరాల్లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ఎదిగానని, బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటూనే చదువునూ కొనసాగించానని సైనా చెప్పారు.

రోజూ ప్రాక్టీస్‌కు వెళ్లడం కష్టమే అయినా.. ఆటకు అవసరమని చెప్పారు. ఇది చాలా కఠినమైన దారని అన్నారు. ట్రైనింగ్‌, ఫుడ్‌, స్లీపింగ్‌... ప్రతీది ప్లానింగ్‌తో ఉంటుందని, ఈ దారి నుంచి బయటకు వెళ్లడం కుదరదని చెప్పారు.

కుటుంబసంబంధాలపై సైనా స్పందిస్తూ.. తానేంటో తన తల్లిదండ్రులకు తెలుసని చెప్పారు. కోచ్‌లు, ప్లేయర్స్‌, బ్మాడ్మింటన్‌ తప్ప మరొకటి తనకు తెలియదన్నారు. రిలేషన్స్‌ పెంచుకోవడానికి కూడా సమయం లేదని, నో సోషల్‌ మీటింగ్స్‌ అని చెప్పారు. ప్రేమ అనేది సుదీర్ఘమైనదన్నారు.

Saina Nehwal

రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి పెద్ద ప్రణాళిక ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌లో ఉద్యోగిగా ఉన్నట్లు తెలిపారు. ఈ జాబ్‌ చేస్తూనే బ్యాడ్మింటన్‌ప్లేయర్స్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవకాశం వస్తే శిక్షణ ఇవ్వడంలాంటివి చేస్తానని సైనా వివరించారు.

తనకు ఫ్రీ టైమ్‌ అంటూ లేదని, ఆదివారం రోజు సినిమాలు చూస్తానని సైనా చెప్పారు. మ్యూజిక్‌ వింటానని, టీవీలో సీరియల్స్‌ చూస్తానని తెలిపారు. కెరీర్ గోల్స్ గురించి మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌లో ఎన్నో విజయాలు అందుకున్నానని తెలిపారు.

ఇంగ్లాండ్‌ టోర్నమెంట్‌, వరల్డ్‌క్‌పలో గోల్డ్‌మెడల్‌ సాధించాలని అన్నారు. ఇందుకోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ ఏడాది జరగనున్న రియో ఒలంపిక్స్‌లోనూ మంచి ప్రదర్శన చేయాలని అన్నారు. డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. శరీరానికి నప్పే దుస్తులు ధరించడానికి ఇష్టపడతానని చెప్పారు. కానీ, ఎక్కువ సమయం తాను స్పోర్ట్స్‌ డ్రెస్‌లో ఉంటానని తెలిపారు.

వంట చేయడం రాదని చెప్పిన సైనా.. ఇప్పటి వరకు కిచెన్‌లో అడుగుపెట్టలేదన్నారు. తన తల్లే తనకు అన్నీ చేసి పెడుతుందని చెప్పారు. ఈ రంగంలో తనకు తన తల్లి రిజర్వాయర్‌లాంటిదని చెప్పారు.

రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరని, తాను సెల్ఫ్‌ మోటివేషన్‌ను నమ్ముతానని సైనా తెలిపారు. అయితే ఇతరులు సాధించిన వాటిని చూసి చాలా నేర్చుకుంటానని, వాటిని తన జీవితంలోనూ అనుసరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. చిన్నతనంలో కామ్ గా ఉన్నప్పటికీ.. స్పోర్ట్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడినని తెలిపారు. టీచర్ చదవలేనంత చిన్నగా రాసేదాన్ని అని తెలిపారు.

బాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. గతంలో ఎవ్వరూ ఈ ప్రశ్న వేయలేదని, తాను ప్లేయర్‌గానే పాపులర్‌.. యాక్టర్‌గా కాదు అని చెప్పారు. ఇతర రంగంలోనూ పాపులర్‌ కావాలనుకోవడం అంత సులభం కాదన్నారు. యాక్టింగ్‌ పట్ల తనకు ఏమాత్రం నాలెడ్జ్‌ లేదన్నారు. ఎందులో పాపులర్‌ కావాలన్నా నేర్చుకోవాలి, ప్రాక్టీస్‌ చేయాలి, పర్‌ఫెక్షన్‌ చూపాలి. అప్పుడే సక్సెస్‌ అవుతామని వివరించారు.

తాను సాధించాల్సిది ఇంకా చాలా ఉందని, అనేక మైలురాళ్లు అధిగమించాలని సైనా నెహ్వాల్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, రియో ఒలింపిక్స్ కోసం ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడం సరైందేనని సైనా చెప్పారు. సల్మాన్ ఖాన్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X