న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా ఛాంపియన్‌షిప్ నుంచి సైనా తప్పుకోనుందా..?

Saina wants to skip Asia Team Championship, BAI reluctant to let go

హైదరాబాద్: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వచ్చే నెలలో జరిగే ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకోవాలని యోచిస్తోంది. మున్ముందు రాబోయే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలంటే ఆసియా ఈవెంట్‌కు దూరంగా ఉండాలని సైనా భావిస్తోంది. ఇందుకుగాను తనకు అనుమతివ్వాలంటూ భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌)కు సైనా లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది.

కానీ, బాయ్‌ ఇందుకు సుముఖంగా లేదు. ప్రతిష్ఠాత్మక ఉబెర్‌ కప్‌కు క్వాలిఫయింగ్‌ టోర్నీ కావడంతో ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌లో ఎలాగైనా ఆడేలా సైనాను ఒప్పించాలని బాయ్‌ పట్టుదలగా ఉంది. ఆసియా టీమ్‌ ఈవెంట్‌ ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరగనుంది.

'థామస్‌, ఉబెర్‌క్‌పలకు క్వాలిఫయర్‌గా ఆసియా టీమ్‌ ఈవెంట్‌ను గుర్తించడంతో ఇది మనకు కీలకమైన టోర్నీగా మారింది. థామస్‌, ఉబెర్‌ కప్‌లకు అర్హత సాధించకపోతే, భారత జట్టు వరల్డ్‌ గ్రూప్‌ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆసియా టోర్నీలో అత్యుత్తమ జట్టును బరిలోకి దించాల్సి ఉంది. అందుకే తన ట్రైనింగ్‌ షెడ్యూల్‌ను మార్చుకొని టోర్నీలో ఆడాల్సిందిగా సైనాకు లేఖ రాస్తున్నా. ఎందుకంటే ఆ టోర్నీ దేశ గౌరవానికి సంబంధించినది' అని బాయ్‌ కార్యదర్శి అనూప్‌ నారంగ్‌ తెలిపారు.

ఈ ఛాంపియన్ ఫిప్‌కు బాయ్ సైనాతో పాటుగా యువ క్రీడాకారుణిలైన కృష్ణప్రియ, రుత్వికలను ఎంపిక చేసింది. వీరి ముగ్గురు కలిసి మూడు సింగిల్స్, రెండు డబుల్స్ గేమ్‌లలో పాల్గొననున్నారు. ఇంతకీ సైనా ఆసియా ఛాంపియన్‌షిప్‌ నుంచి మినహాయింపు కోరింది ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ కోసం. దాని ప్రైజ్ మనీ పది లక్షల డాలర్లు అంటే ఆరు కోట్ల 36 లక్షల రూపాయలకు పైగానే..

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 11:12 [IST]
Other articles published on Jan 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X