న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Senior Nationals: సైనా నాలుగోసారి, ఫైనల్లో సింధుపై విజయం

Saina, Saurabh emerge champions in the National badminton

హైదరాబాద్: సైనా మళ్లీ మెరిసింది. జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో గతేడాది సింధును కంగుతినిపిస్తూ టైటిల్‌ గెలుచుకున్న సైనా మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా 21-18, 21-15తో టాప్‌సీడ్ సింధుపై విజయం సాధించింది. దీంతో సైనా జాతీయ ఛాంపియన్‌‌షిప్ గెలవడం ఇది నాలుగోసారి. సైనా గతంలో 2006, 2007, 2018లో విజేతగా నిలిచింది. ఛాంపియన్‌గా నిలిచిన సైనాకు రూ. 3.25 లక్షలు, రన్నరప్ సింధుకు రూ. 1.70 లక్షల ప్రైజ్‌మనీ లభించాయి.

44 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో

44 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో

44 నిమిషాల పాటు జరిగిన మహిళల టైటిల్ పోరులో సైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించింది. తొలి గేమ్‌లో ఒకింత మందకొడిగా కనిపించిన నెహ్వాల్‌..ఆపై పుంజుకొని 5-5తో స్కోరు సమం చేసింది. మొదటి బ్రేక్‌కు ఆమె 11-10తో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. విరామం అనంతరం విజృంభించిన సైనా 21-18తో గేమ్‌ను కైవసం చేసుకుంది.

సింధు షాట్లలో కచ్చితత్వం లోపించడం

రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టిన సింధు 3-3, 5-5తో స్కోరును సమం చేసింది. కానీ ప్రత్యర్థి షాట్లలో కచ్చితత్వం లోపించడం, రిటర్న్స్ పదేపదే వైడ్‌గా వెళ్లడంతో పుంజుకున్న సైనా 11-9 ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రేక్‌ తర్వాత అదే జోరుతో వరుసగా పాయింట్లు సాధించి సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

పురుషుల సింగిల్స్‌ విజేతగా సౌరభ్‌ వర్మ

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 26 ఏళ్ల మధ్యప్రదేశ్‌ ఆటగాడు సౌరభ్‌ 21-18, 21-13 స్కోరుతో లక్ష్యసేన్‌పై గెలుపొంది హ్యాట్రిక్ టైటిల్స్‌ను సాధించాడు. 2011, 2017లో సౌరభ్ విజేతగా నిలిచాడు. 44 నిమిషాల ఏకపక్ష పోరులో 17ఏళ్ల లక్ష్యసేన్ శక్తి మేరకు శ్రమించి పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు.

రెండో గేమ్‌లో దూకుడుగా ఆడిన సౌరభ్ వర్మ

రెండో గేమ్‌లో దూకుడుగా ఆడిన సౌరభ్ వర్మ

తొలి గేమ్‌లో 6-6, 15-15 వద్ద స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత లయ తప్పాడు. ఈ దశలో సౌరభ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గినా.. లక్ష్యసేన్ ఒక్కో పాయింట్‌కే పరిమితమయ్యాడు. రెండో గేమ్‌లో సౌరభ్ దూకుడు పెంచడంతో లక్ష్యసేన్ 4-4, 7-7తో స్కోరు సమం చేసి వెనుకబడ్డాడు. 8-7 స్కోరు వద్ద సౌరభ్ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఒకటి, రెండు నెగ్గినా.. చివర్లో మళ్లీ వరుస పాయింట్లతో హోరెత్తించాడు.

మహిళల డబుల్స్‌ విజేతగా శిఖ-అశ్విని జోడీ

మహిళల డబుల్స్‌ విజేతగా శిఖ-అశ్విని జోడీ

పురుషుల డబుల్స్ టైటిల్‌ను ప్రణవ్ చోప్రా-చిరాగ్ శెట్టి గెలుచుకున్నారు. ఫైనల్లో ఈ ఇద్దరు 21-13, 22-20తో అర్జున్-రామచంద్రన్‌ జోడీపై విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో శిఖ-అశ్విని 21-16, 22-20తో మేఘన-పూర్వీషాలపై గెలిచి టైటిల్‌ నెగ్గగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మను అత్రి-మనీషా 18-21, 21-17, 21-16తో రోహన్‌-కుహు గార్గ్‌ను ఓడించి విజేతలుగా నిలిచారు.

Story first published: Sunday, February 17, 2019, 11:21 [IST]
Other articles published on Feb 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X