న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కఠినమైన సవాల్ ఎదుర్కొననున్న పీవీ సింధు

PV Sindhu wins 24-22, 21-5 vs Yamaguchi

న్యూ ఢిల్లీ: బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ పోరు బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా గ్రూప్‌-ఎలో సింధుతో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), రెండో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌), బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) ఉండగా.. గ్రూప్‌-బిలో నొజొమి ఒకుహర (జపాన్‌), చెన్‌ యుఫెయ్‌ (చైనా), ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), మిషెలీ లీ (కెనడా)లకు చోటు దక్కింది.

గ్రూప్‌-బి కంటే గ్రూప్‌-ఎలోనే పోటీ తీవ్రంగా

గ్రూప్‌-బి కంటే గ్రూప్‌-ఎలోనే పోటీ తీవ్రంగా

గ్రూప్‌-ఎ, బిల్లో అత్యధిక విజయాలు సాధించిన ఇద్దరు చొప్పున క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. గ్రూప్‌-బి కంటే గ్రూప్‌-ఎలోనే పోటీ తీవ్రంగా జరగనుంది. యింగ్‌, యమగూచిల నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. బుధవారం జరిగే గ్రూప్‌-ఎ మహిళల సింగిల్స్‌ తొలి పోరులో యమగూచితో సింధు తలపడుతుంది. యమగూచిపై సింధుకు 9-4తో మెరుగైన విజయాల రికార్డున్నా.. ఈ సంవత్సరం సింధు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాల్గింటిలో ఓటమికి గురైంది.

ఈ సారి ఫైనల్స్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యా

ఈ సారి ఫైనల్స్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యా

ఈ టోర్నీలో పాల్గొనడం గురించి మాట్లాడుతూ.. ‘కావాల్సినంత సమయం లభించడంతో ఫైనల్స్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యా. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి టైటిల్‌ గెలవాలనేదే నా లక్ష్యం. అత్యుత్తమ క్రీడాకారులు బరిలో ఉండటంతో పోటీ త్రీవంగా ఉంటుంది. అయినా టైటిల్‌ గెలిచేందుకు శాయశక్తులా పోరాడతాను'అని సింధు తెలిపింది.

తొలిసారి ఫైనల్స్‌కు అర్హత సాధించిన సమీర్‌

తొలిసారి ఫైనల్స్‌కు అర్హత సాధించిన సమీర్‌

ఇక తొలిసారి ఫైనల్స్‌కు అర్హత సాధించిన సమీర్‌కు గట్టి పోటీ ఎదురవనుంది. గ్రూప్‌-బిలో సమీర్‌, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటొ మొమొట (జపాన్‌), టామి సుగియార్తో (ఇండోనేసియా), కాంటాఫాన్‌ (థాయ్‌లాండ్‌)లు ఉన్నారు. తొలి పోరులో మొమొటతో సమీర్‌ తలపడతాడు. ఇప్పటి వరకు వీరిద్దరు రెండు మ్యాచ్‌లలో పోటీపడగా కేవలం ఒక్కదానిలో మాత్రమే గెలిచారు. కాగా, ప్రస్తుతం చక్కని ఫామ్‌లో దూసుకెళ్తోన్న మొమొటను నిలువరించడమంటే సమీర్‌కు కష్టతరమే.

అత్యధికంగా ఏడు సార్లు బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌

అత్యధికంగా ఏడు సార్లు బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌

అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ప్రపంచంలోని 8 మంది అత్యుత్తమ క్రీడాకారులు ఉండే పోటీలో సైనా నెహ్వాల్‌ అత్యధికంగా ఏడు సార్లు బరిలో దిగింది. 2011లో ఫైనల్‌ చేరుకోవడమే సైనా అత్యుత్తమ ప్రదర్శన. 2009లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా జ్వాల-డిజు జోడీ రన్నరప్‌గా నిలిచింది. 2016లో సెమీస్‌, 2017లో ఫైనల్‌ చేరుకున్న సింధు.. మూడోసారైనా విజేతగా నిలవాలని భావిస్తోంది. ఐతే సింధుకు కఠినమైన డ్రా ఎదురైంది.

Story first published: Wednesday, December 12, 2018, 11:05 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X