న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ న్యూస్ చెప్పిన పీవీ సింధు.. గాయం వల్ల ఇక తప్పుకుంటున్నానంటూ ట్వీట్

 PV Sindhu Stated that She Wont Be Available for BWF World Championship due to Injury

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ మాజీ ఛాంపియన్ అయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు షాకింగ్ విషయం వెల్లడించింది. బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ టైంలో ఆమె గాయపడ్డ సంగతి తెలిసిందే. తద్వారా ఆగస్టు 21 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. కామన్ వెల్త్ గేమ్స్ టైంలో తన ఎడమ పాదం మీద ఫ్రాక్చర్ అయ్యిందని, అందువల్ల ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుంచి వైదొలుగుతున్నానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. 'భారత్‌ తరఫున కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ పతకం సాధించగలిగిన నేను.. దురదృష్టవశాత్తూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని సింధు శనివారం ట్వీట్‌లో పేర్కొంది.

బ్యాండేజీతో ఆడి మరీ గెలిచింది

కెనడాకు చెందిన మిచెల్ లీతో కామన్వెల్త్ గేమ్స్‌ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పీవీ సింధు తలపడింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఎడమ కాలుకు బ్యాండేజీ వేసుకుని ఆడింది. ఆమె గాయంతో విలవిల్లాడుతూనే వీరోచితంగా పోరాడింది. వరుసగా సింధు 21-15, 21-13 సెట్లను కైవసం చేసుకుని స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టింది. తద్వారా తొలిసారి కామన్‌వెల్త్ పోడియంపై తన గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక ఫైనల్ టైంలో సింధు గాయం తీవ్రతను కన్పించలేదు. కానీ అది మరింత తిరగబెట్టడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు దూరం కాక తప్పలేదు.

హైదరాబాద్ రాగానే ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్లా

హైదరాబాద్ రాగానే ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్లా

సింధు కామన్ వెల్త్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్-ఫైనల్, సెమీ-ఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌లను గాయం వల్ల నొప్పితోనే ఆడినట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ‘సీడబ్ల్యుజీ క్వార్టర్-ఫైనల్స్‌లో నాకు ఎడమ మడమ వద్ద నొప్పిగా అనిపించింది. గాయం కాస్త భయాందోళ రేకెత్తించింది. కానీ నా కోచ్, ఫిజియో, ట్రైనర్ సహాయంతో.. నేను చేయగలిగినంత ప్రయత్నం చేశా. ఫైనల్లో నొప్పి భరించలేనంత తీవ్రమైంది. ఇక నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే MRI స్కాన్ కోసం వెళ్లాను. వైద్యులు నా ఎడమ పాదం మీద ఒత్తిడి ఫ్రాక్చర్‌ని నిర్ధారించారు . కొన్ని వారాల పాటు బెడ్‌రెస్ట్‌ని సిఫార్సు చేసారు. నేను కొన్ని వారాల పాటు శిక్షణకు దూరం కానున్నాను.' అని సింధు పేర్కొంది.

IND VS PAK: రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి *Cricket | OneIndia Telugu
విజయవంతమైన భారత షట్లర్

విజయవంతమైన భారత షట్లర్

సింధు కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించకముందే సింగపూర్ ఓపెన్ గెలిచింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇకపోతే ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌లో ఒక గోల్డ్, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలను గెలుచుకున్న సింధు ఆ టోర్నీలో అత్యంత విజయవంతమైన భారతీయ షట్లర్‌లలో ఒకరు.

Story first published: Sunday, August 14, 2022, 10:08 [IST]
Other articles published on Aug 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X