న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఈ సారి పతకాలతోనే తిరిగొస్తాం'

PV Sindhu Gets Well Prepared For Japan Open
PV Sindhu, Saina Nehwal aim to return better

జకార్తా: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో రెండు పతకాల సాధించినందుకు ఆనందంగా ఉందని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ అన్నాడు. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన సింధు, కాంస్యం నెగ్గిన సైనా నెహ్వాల్‌, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ గురువారం గచ్చిబౌలీలోని గోపీచంద్‌ అకాడమీలో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. వచ్చే ఆసియా క్రీడల్లో కచ్చితంగా స్వర్ణంతో తిరిగొస్తామని అన్నాడు. అంతా ముగిసిపోయినట్లు కాదని.. సత్తాచాటుకునేందుకు చాలా టోర్నీలు ఉన్నాయని భారత స్టార్‌ షట్లర్‌ పీవి సింధు తెలిపింది. సింధు తరహాలోనే మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అదే విశ్వాసం వ్యక్తం చేశారు. కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో సైనా.. సింధులు బాగా రాణిస్తున్నామని తెలిపారు.

ఓటములు విజయాలకు మెట్లు:

ఓటములు విజయాలకు మెట్లు:

‘అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. అత్యుత్తమ ఫలితం కోసమే చివరి వరకు పోరాడతామని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్ని సార్లు కుదరదు. రియో ఒలింపిక్స్‌లో రజతం తర్వాత కెరీర్‌ అద్భుతంగా సాగుతోంది. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (2 రజతాలు), ఇప్పుడు ఆసియా క్రీడలు. ఈ రజతాలలో ఒకదానితో మరోదానికి పోలిక లేదు. ప్రతి పతకం నాకు ప్రత్యేకమే. ఓటమి నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. మంచి విషయాల్ని గుర్తించి.. బలహీనతలను సరిచేసుకోవచ్చు. ఓటములు విజయాలకు మెట్లు. మరింత బలంగా తిరిగొస్తా. ఇక్కడితో అంతా ముగిసిపోయినట్లు కాదు. సత్తాచాటుకునేందుకు ఇతర మ్యాచ్‌లు, టోర్నీలు చాలా ఉన్నాయి. నా వెన్నంటి నిలుస్తున్న గోపీ సర్‌, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు'

నా కెరీర్‌ సంపూర్ణం:

నా కెరీర్‌ సంపూర్ణం:

‘నాలుగేళ్లకోసారి నిర్వహించే ఆసియా క్రీడల్లో పతకం సాధించడం అంత సులువు కాదు. మా ప్రత్యర్థి ప్రపంచ నంబర్‌వవ్‌ లేదా ప్రపంచ 50వ ర్యాంకర్‌ అయినా గట్టి పోటీ ఎదుర్కొన్నాం. నా కెరీర్‌లో నాలుగో ఆసియా క్రీడల్లో పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఈ పతకంతో నా కెరీర్‌ సంపూర్ణమైంది. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, సూపర్‌ సిరీస్‌, ఆసియా క్రీడల వంటి ప్రతిష్టాత్మక టోర్నీలన్నింట్లో పతకాలు గెలిచా. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుంది. భవిష్యత్తులో మరింత బాగా ఆడతా. వచ్చే ఆసియా క్రీడల్లో పతకం రంగు మార్చేందుకు ప్రయత్నిస్తా. గాయం నుంచి కోలుకుని ఈ స్థాయికి చేరుకోవడం గొప్పగా అనిపిస్తుంది. నాకు మద్దతుగా నిలిచిన గోపీ సర్‌కు కృతజ్ఞతలు. ఇప్పుడు మరింత ఫిట్‌గా, మెరుగ్గా ఉన్నా. ఆటను మెరుగుపర్చుకునేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. తై జు యింగ్‌ లాంటి క్రీడాకారిణిని ఓడించడం కోసం కఠోర సాధన చేస్తా'

మెరుగ్గా రాణించాల్సింది:

మెరుగ్గా రాణించాల్సింది:

‘పురుషుల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకాలు గెలిచే అవకాశాలు తృటిలో చేజారాయి. 2 పతకాలతో తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఇంకా మెరుగ్గా రాణించాల్సింది. తర్వాతి ఆసియా క్రీడలకు నాలుగేళ్ల సమయముంది. అప్పుడు స్వర్ణంతో తిరిగొస్తాం. సైనా, సింధు అద్భుతంగా ఆడారు. శారీరకంగా, మానసికంగా గొప్ప దృఢత్వం ప్రదర్శించారు. భవిష్యత్తులో వారి ప్రదర్శనను మెరుగుపర్చుకునే అవకాశముంది. ఛాంపియన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌ను ఓడించాలంటే చాలా కష్టపడాలి. ఆసియా క్రీడల సన్నాహానికి ఎక్కువ సమయం లభించలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి స్వర్ణమే గెలవాలని ఉంటుంది. ఏదో ఒకరోజు సింధు స్వర్ణం సాధించి అందరి నోటికి తాళం వేస్తుంది! ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల నుంచి రజత పతకాలతో తిరిగిరావడం ఎంతో గర్వకారణం'

జాతీయ జెండా కళ్లముందు ఎగురుతుంటే

జాతీయ జెండా కళ్లముందు ఎగురుతుంటే

‘పోడియం ఫినిష్‌ ఎప్పటికీ చిరస్మరణీయమే. పతక విజేతగా నిలబడి మనముందు జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేను. అయితే ఈ పతకాలను ఆస్వాదించే సమయం కూడా మాకు లేదు. జపాన్‌ ఓపెన్‌ (సెప్టెంబర్‌ 11 నుంచి) కోసం వెంటనే సన్నాహకాల్లో పాల్గొనాలి' అని చెప్పింది.

Story first published: Friday, August 31, 2018, 10:50 [IST]
Other articles published on Aug 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X