చరిత్ర సృష్టించిన సింధు: 'లెజెండ్' అంటూ ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

Posted By:

హైదరాబాద్: సియోల్‌ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ఘన విజయం సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరపై సింధు 22-20, 11-21, 21-18తో గెలుపొందింది.

దీంతో తన కెరీర్‌లోనే తొలిసారి కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. అంతేకాదు కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. కొరియా ఓపెన్ విజేతకు 6 లక్షల డాలర్లు బహుమతిగా లభిస్తుంది. తొలి సెట్‌లో 22-20తో ఆధిక్యం ప్రదర్శించిన సింధు, రెండో సెట్‌ను 11-21 తేడాతో ఓడిపోయింది.

హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధు, 21-18 తేడాతో తన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పీవీ సింధు విజయంపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా సింధుకు అభినందనలు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

‘కంగ్రాట్స్‌ సింధు.. మరోసారి త్రివర్ణ పతాకం ఎత్తున ఎగిరేలా చేశావు. ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం ఇది'

కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌

‘బ్రిలియంట్‌ గేమ్‌. అభినందనలు సింధు. నిన్ను చూసి భారత్‌ గర్వపడుతోంది. ఇక నీ విజయాలను ఎవరూ ఆపలేరు'

వీరేంద్ర సెహ్వాగ్‌

‘22ఏళ్ల వయసులోనే పీవీ సింధు ఓ లెజెండ్‌గా మారిపోయింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. కంగ్రాట్స్‌ సింధు'

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్

‘కంగ్రాట్స్‌ సింధు. యావత్‌ భారతం గర్విస్తోంది'

ఐటీ శాఖ, తెలంగాణ

'చరిత్ర సృష్టించిన సింధుకు అభినందనలు'

అమితాబ్‌ బచ్చన్‌

‘యాహూ సింధు నిరూపించింది. కొరియా ఓపెన్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణి సింధు. స్వీట్‌ రివేంజ్‌'

బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

‘తాను ఓడించగలను అని నమ్మింది. ఓడించి చూపించింది. భారత్‌ గర్వపడుతోంది సింధు. కంగ్రాట్స్‌'

మళయాళ నటుడు మోహన్‌లాల్‌

‘కంగ్రాట్స్‌ సింధు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.'

ఆనంద్‌ మహీంద్రా

‘నీపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసినందుకు థాంక్యూ సింధు. నువ్వు వారియర్‌వి.'

మహ్మద్‌ కైఫ్‌

‘వాట్‌ ఏ ఛాంపియన్‌.. ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్‌ను దక్కించుకుంది'

మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘సింధు గొప్ప ప్రత్యర్థిగా ఎదుగుతోంది. టైటిల్‌ సాధించినందుకు కంగ్రాట్స్‌.'

మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

'సింధు నీకు అభినందనలు. మా అందరిని గర్వించేలా చేశావు'

కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు

'సింధు మరో అత్యుత్తమ ప్రదర్శన. అభినందనలు. గెలుస్తూనే ఉండు'

బాలీవుడ్ నటుడు సోనూసూద్

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఛాంపియన్‌. బిరియానీ ట్రీట్‌కు సిద్ధంగా ఉండు' బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ సింధుకు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సింధు జీవితాధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్‌కు సోనూసూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Story first published: Sunday, September 17, 2017, 14:52 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి