హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా.. కోచ్‌గా కనిపించిన పుల్లెల గోపీచంద్ ఇప్పుడు ఓ కార్యక్రమానికి హోస్ట్‌లా వ్యవహరించనున్నారు. ప్రతి గురువారం ఫోన్ ద్వారా ప్రశ్నలకు బదులిచ్చి ఆకర్షణీయమైన నగదు బహుమతి గెలుచుకునే అవకాశం కల్పిస్తోన్న 'బ్రెయిన్ బాజీ'యాప్‌నకు అనేక మంది సినీ, క్రీడా ప్రముఖులు వాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ వారం ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
లైవ్ షోలో పాల్గొవాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనమిక్ టైమ్స్, నవభారత్ టైమ్స్ వెబ్‌సైట్ నుంచి యాప్ లింక్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వారానికొక ఎపిసోడ్ వస్తున్న తరుణంలో వివిధ రంగాల్లో ప్రముఖులు దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. లింక్ డౌన్‌లోడ్ చేసుకుని రాత్రి 8.30 గంటల సమయంలో అడిగే ప్రశ్నలకు బదులిస్తే ఈవెంట్ పూర్తయిపోతుంది.
అన్నీ సరైన సమాధానాలిస్తే.. మీ మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పడిపోతాయి. ఈ యాప్‌ను ఇప్పటికే మనదేశంలో లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. గతంలో రికార్డుస్థాయిలో ఏకంగా 5,55,572 మంది యూజర్లు ఒకేసారి ఈ లైవ్ క్విజ్ యాప్‌ను ఉపయోగించారు. ఈ 5.5 లక్షల మందిలో 18,782 మంది విజేతగా నిలిచారు. కొందరు రూ.5 లక్షల బంపర్ ప్రైజ్ కూడా అందుకున్నారు. పాఠకుల ఇంటరాక్షన్‌తో బ్రెయిన్ బాజీ యాప్ మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో దూసుకెళ్తోంది.
గత ఫిబ్రవరిలోనే బ్రెయిన్ బాజీని ఆవిష్కరించగా.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్ స్టోర్లలో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్‌ల్లో ఒకటిగా నిలిచింది. దేశంలోని అతిపెద్ద డిజిటల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయిన టైమ్స్ ఇంటర్నెట్ ఈ యాప్‌ను క్రియేట్ చేసింది. బ్రెయిన్ బాజీ లైవ్ వీడియో షోలో రోజూ 11 ప్రశ్నలు అడుగుతారు. యూజర్లు కొద్ది సమయంలో వీటన్నింటికీ బదులు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారికి బహుమతులు అందజేస్తారు.