'బాయ్‌కు అధ్యక్షుడిగా అతనిని తొలగించండి'

Posted By:
PIL seeks removal of Sarma from BAI management

హైదరాబాద్: బాయ్ (బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిత్త ఏదో ఓ కారణంగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా బాయ్ అధ్యక్ష పదవి గురించి వాడీవేడిగా చర్చ నడుస్తోంది. దీని నిమిత్తం అస్సాం మంత్రి హిమంత బిశ్వశర్మను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేసింది.

మంత్రి పదవిలో ఉంటూ క్రీడా సమాఖ్యలో కార్యవర్గ సభ్యుడిగా కొనసాగడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లే అవుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై 8 వారాల్లో తమ అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

బీసీసీఐని గాడిన పెట్టేందుకు జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సుల్ని సుప్రీంకోర్టు ఆమోదించిన విషయం తెలిసిందే. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం హిమంతకు బాయ్‌ అధ్యక్ష పదవిలో కొనసాగే అర్హత లేదని పిటిషనర్‌ ఆరోపించాడు.

దీంతో సోమవారం బాయ్‌తో పాటుగా బీసీసీఐ కూడా సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. అధ్యక్ష పదవి చర్చ కోసం బాయ్ హాజరవుతుండగా. ప్రారంభవేడుకల ఖర్చుపై చర్చ కోసం సీఓఏ( కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) అప్పీలు మేరకు సుప్రీం కోర్టు చర్చకు సిద్ధమైంది.

Story first published: Tuesday, March 6, 2018, 9:10 [IST]
Other articles published on Mar 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి