న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: ఢిల్లీపై ముంబై 5-0తో ఘన విజయం, సైనా జట్టుకు నిరాశే

 PBL: Sameer Verma, Shreyanshi Pardeshi shine in Mumbai’s dominating win over Delhi

హైదరాబాద్: ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్)లో నాలుగో సీజన్‌లో ముంబై రాకెట్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఢిల్లీ డాషర్స్‌తో జరిగిన రెండో టైలో 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌ను ముంబయి ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో యంగ్‌ డే-కిమ్‌ జంగ్‌ (ముంబయి) 14-15, 15-12, 15-9తో చాయ్‌ బియావో-వాంగ్‌ సిజీపై విజయం సాధించారు.

<strong>తిరగబెట్టిన చేతి వేలి గాయం: బాక్సింగ్ డే టెస్టులో ఆడటంపై ఫించ్ ధీమా</strong>తిరగబెట్టిన చేతి వేలి గాయం: బాక్సింగ్ డే టెస్టులో ఆడటంపై ఫించ్ ధీమా

ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో అండ్రెస్‌ అంటొనెన్‌ 15-13, 15-7తో టామి సుగియార్తోను ఓడించి ముంబై ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. దీంతో జట్టు 2-0తో ఆధిక్యం సాధించింది. ఢిల్లీ కెప్టెన్‌ ప్రణయ్‌ 14-15, 9-15తో సమీర్‌వర్మ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో ముంబై విజయం ఖాయమైంది. సమీర్‌ వర్మ 15-14, 15-9 తేడాతో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై నెగ్గాడు.

మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన శ్రేయాన్షి పర్దేషి ఆట

మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన శ్రేయాన్షి పర్దేషి ఆట

దీంతో ముంబై 4-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జొంగ్‌జిత్‌-లీచినా (ఢిల్లీ) 15-11, 15-12తో యంగ్‌ డే-బియర్‌నాత్‌పై గెలిచి ఢిల్లీకి తొలి విజయాన్ని అందించారు. ఆఖరి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌ను ఢిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 201వ స్థానంలో ఉన్న శ్రేయాన్షి పర్దేషి అద్భుత ఆటతీరు హైలైట్‌గా నిలిచింది. శ్రేయాన్షి 12-15, 15-8, 15-10 తేడాతో ప్రపంచ 32వ ర్యాంకర్‌ ఎవ్గెనియా కొసెట్స్‌కయాను కంగుతినిపించింది.

సైనా జట్టుకు నిరాశ

సైనా జట్టుకు నిరాశ

మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 4-1తో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్ననార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ను ఓడించింది. తొలుత పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌ను నార్త్‌ ఈస్ట్రన్‌ జట్టు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకోగా.. సాత్విక్‌ సాయిరాజ్‌-లీ రెగైనాల్డ్‌ (అహ్మదాబాద్‌) 10-15, 15-14, 15-14తో లివొ చున్‌-యో సెంగ్‌లను ఓడించి అహ్మదాబాద్‌కు శుభారంభం ఇచ్చింది. ఇక అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌ అయిన పురుషుల సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సన్‌ 15-11, 15-14తో సేన్‌సోమ్‌బూన్‌సక్‌ను ఓడించి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

క్రిస్టి గిల్మోర్‌పై నెగ్గిన రితుపర్ణాదాస్‌

క్రిస్టి గిల్మోర్‌పై నెగ్గిన రితుపర్ణాదాస్‌

ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రితుపర్ణాదాస్‌ 15-8, 15-9తో క్రిస్టి గిల్మోర్‌పై విజయం సాధించి నార్త్‌ ఈస్ట్రన్‌ జట్టు పాయింట్ల ఖాతా తెరిచినా లాభం లేకపోయింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో తియాన్‌ 11-15, 15-10, 15-11తో డారెన్‌లీపై గెలిచి అహ్మదాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. చివరగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-సాత్విక్‌ సాయిరాజ్‌ 15-8, 15-7తో యు-కిమ్‌లపై నెగ్గి అహ్మదాబాద్‌ ఘన విజయం సాధించింది.

పీబీఎల్‌లో సోమవారం

పీబీఎల్‌లో సోమవారం

పుణె 7 ఏసెస్‌ Vs అవధె వారియర్స్‌, (రాత్రి 7 గంటలకు)

Story first published: Monday, December 24, 2018, 12:21 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X