న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపిచంద్ చేతులమీదుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్

 P Gopichand inaugurates Bennett University sports complex

హైదరాబాద్: ప్రముఖ ప్రసార మాద్యమమైన టైమ్స్ గ్రూప్‌కు చెందిన బెన్నెట్ యూనివర్సిటీ క్రీడల కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ నొయిడా క్యాంపస్‌లో నిర్మించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌ను (జనవరి 15న) ప్రారంభించింది. నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్, ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలో యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్ని సౌకర్యాలున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలో చాలా తక్కువ మంది క్రీడలకు ఇలాంటి మంచి మౌలికసదుపాయాలు కల్పిస్తున్నారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టడం వెనుక కృషిచేసిన అందరికీ నా అభినందనలు' అని గోపీచంద్ అన్నారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గోపీచంద్ విద్యార్థులతో కలసి బ్యాడ్మింటన్ ఆడారు.

ఈ సందర్భంగా బెన్నెట్ యూనివర్సిటీ చాన్సెలర్, టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ మాట్లాడుతూ.. గోపీచంద్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించడం గొప్ప గౌరవమన్నారు. మన దేశాన్ని ఒంటిచేత్తో బ్యాడ్మింటన్ సూపర్ పవర్‌గా మార్చిన ఘనత గోపీచంద్‌దని ఆయన కొనియాడారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం గోపీచంద్‌ను మించిన స్ఫూర్తి మరొకటి లేదన్నారు. కొత్తగా వస్తున్న ఇండియన్ స్టార్లకు ఆయన ఒక మార్గదర్శకుడని చెప్పారు.

బెన్నెట్ యూనివర్సిటీలో నిర్మించిన ఈ కొత్త స్పోర్ట్స్ బ్లాక్‌లో మూడు స్క్వాష్, ఒక బ్యాడ్మింటన్, ఒక టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే స్విమ్మింగ్ పూల్, జిమ్నాసిజం, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ ఎరీనా, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులను కూడా నిర్మించారు. వచ్చే ఏడాదిలోపు కబడ్డీ, క్రికెట్ ప్లేయింగ్, ప్రాక్టీస్ పిచ్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు బెన్నెట్ యూనివర్సిటీ ప్రకటించింది.

Story first published: Tuesday, January 16, 2018, 12:07 [IST]
Other articles published on Jan 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X