న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబుల్స్ పార్టనర్‌గా ధోనీ లేదా కోహ్లీని ఎంచుకుంటా: పీవి సింధు

MS Dhoni or Virat Kohli would make great doubles partner: PV Sindhu

హైదరాబాద్: పీవి సింధు హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను విరామం దొరికినప్పుడల్లా గ్యాలరీలో కూర్చొని వీక్షిస్తూ సన్‌రైజర్స్‌ను ఉత్తేజరుస్తూ ఉంటారు. శనివారం కూడా ఆమె సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సపోర్ట్ చేస్తూ ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు. ఆట నుంచి కాస్త విరామం దొరకడంతో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరై హైదరాబాద్ జెండా పట్టుకుని స్టేడియంలో కనిపించారు.

డబుల్స్ పార్ట్‌నర్‌గా టీమిండియా నుంచి ఎవరిని:

డబుల్స్ పార్ట్‌నర్‌గా టీమిండియా నుంచి ఎవరిని:

మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు స్టూడియోలోని ప్రజెంటర్.. గ్యాలరీలో ఉన్న పీవీ సింధుతో మాట్లాడారు. వాటిపై సింధు.. ఇలా స్పందించారు. ‘బ్యాడ్మింటన్‌లో మీ డబుల్స్ పార్ట్‌నర్‌గా టీమిండియా నుంచి ఎవరిని తీసుకుంటారు' అని ప్రజెంటర్ అడిగిన ప్రశ్నకు ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. భారత జట్టులో ఎవరైతే అత్యుత్తమంగా ఆడతారో వారిని తన డబుల్స్ భాగస్వామిగా ఎంపిక చేసుకుంటానన్నారు.

ధోనీ, కోహ్లీ నుంచి చాలా నేర్చుకోవచ్చు:

ధోనీ, కోహ్లీ నుంచి చాలా నేర్చుకోవచ్చు:

జట్టులో అందరూ ఎలా ఆడతారో తనకు తెలీదని, అయితే ఎం.ఎస్.ధోనీ లేదంటే విరాట్ కోహ్లీలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పారు.‘ధోనీ, కోహ్లీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆటలో దూకుడు, వాళ్లు ఆడే విధానం, ఇలా చాలా విషయాలు వాళ్లిద్దరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ధోనీ, కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. కాబట్టి వాళ్లిద్దరిలో ఎవరినైనా నేను డబుల్స్ పార్ట్‌నర్‌గా ఎంచుకుంటాను' అని సింధు చెప్పుకొచ్చారు.

మద్దతు తెలపడానికి వచ్చానని

మద్దతు తెలపడానికి వచ్చానని

ఖాళీ సమయం దొరికితే క్రికెట్ చూడటానికి వస్తుంటానని, అయితే శనివారం సన్‌రైజర్స్ మ్యాచ్ కావడంతో వారికి మద్దతు తెలపడానికి వచ్చానని సింధు చెప్పారు. తనకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోతే, తాను హైదరాబాద్‌లోనే ఉంటే కచ్చితంగా సన్‌రైజర్స్‌ను ఫాలో అవుతుంటానని వెల్లడించారు. సన్‌రైజర్స్ జట్టులో ఫలానా ఆటగాడు బాగా ఆడుతున్నాడని చెప్పలేనని, జట్టు మొత్తం అద్భుతంగా రాణిస్తోందని తెలిపారు.

బ్యాడ్మింటన్ క్రికెట్‌కు చాలా దగ్గరగా:

బ్యాడ్మింటన్ క్రికెట్‌కు చాలా దగ్గరగా:

బ్యాడ్మింటన్ బ్యాట్ స్పీడ్ క్రికెట్‌కు చాలా దగ్గరగా ఉంటుందని సింధు అన్నారు. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌‌లో కొన్నింటిని పోల్చి చూడొచ్చని చెప్పారు. సింధుతో పాటు మరో క్రీడాకారిణి ఛాముండేశ్వరినాథ్‌కు కూడా మ్యాచ్‌కు హాజరయ్యారు.

Story first published: Sunday, May 20, 2018, 17:14 [IST]
Other articles published on May 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X