న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా ఓపెన్: సెమీస్‌లో సింధు, ముగిసిన పురుషుల పోరు

By Nageshwara Rao
India Open: PV Sindhu in semis; Saina, Carolina bow out; Sameer loses in men's QF

హైదరాబాద్: ఇండియా ఓపెన్‌ సూపర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సింధు 21-12, 19-21, 21-11 స్కోరుతో బెట్రిజ్‌ కొరెల్స్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించింది. సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్‌ ఇంటానాన్‌తో తలపడుతుంది.

మరోవైపు గురువారం కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించగా.. శుక్రవారం సైనా నెహ్వాల్‌, కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ పరాజయం చవిచూశారు.. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పీవీ సింధు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి- ప్రణవ్‌ చోప్రా మాత్రమే భారత్‌ తరఫున పోరాటం కొనసాగిస్తున్నారు.

Being The Defending Champion Is Not A Pressure - Sindhu

టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న నాలుగో సీడ్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లో అదే జోరు కనబరచలేకపోయింది. ఐదోసీడ్‌ అమెరికన్‌ బీవెన్‌ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస గేముల్లో 10-21, 31-21 స్కోరుతో ఓడిపోయి టోర్నీనుంచి నిష్క్రమించింది. ఇక, మారిన్‌ 12-21, 19-21తో చూంగ్‌ నాన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమిపాలైంది. తన ఓటమికి పేలవమైన అంపైరింగ్‌ కారణమని మారిన్‌ ఆరోపించింది.

ఇక, పురుషుల సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, సౌరవ్‌ వర్మ క్వార్టర్స్‌లో ఓడారు. కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్‌ కశ్యప్‌ 16-21, 18-21 స్కోరుతో బిన్‌ క్వియావో (చైనా)చేతిలో, ఎనిమిదో సీడ్‌ సాయిప్రణీత్‌ 15-21, 13-21 స్కోరుతో మూడోసీడ్‌ టిన్‌ చెన్‌ చౌ (చైనీ్‌సతైపీ) చేతిలో ఓడిపోయారు. ఇక సమీర్‌ 17-21, 14-21 స్కోరుతో ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ (మలేసియా) చేతోలో ఓటమిపాలయ్యాడు.

మిక్స్‌డ్‌లో ఎనిమిదోసీడ్‌ ప్రణవ్‌ జెర్రీ చోప్రా- సిక్కిరెడ్డి జోడీ 21-8, 21-13తో హాన్‌ సీ- కవోటి జోడీపై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. మరో క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప 17-21, 11-21తో క్రిస్టియన్‌సెన్‌- పెడర్సన్‌ జోడీ చేతిలో ఓటమిపాలైంది.

మహిళల డబుల్స్‌లో ఆరోసీడ్‌ అశ్వినీ పొన్నప్ప- సిక్కిరెడ్డి జోడీ 17-21, 21-23తో డు యీ - లీ యిన్‌ జోడీ ఓటమి పాలవ్వగా, ఏడోసీడ్‌ జక్కంపూడి మేఘన, పూర్విషా రామ్‌ 10-21, 15-21 స్కోరుతో రెండోసీడ్‌ థాయ్‌లాండ్‌ జంట జోంగ్‌కోల్పన్‌, రవీంద చేతిలో ఓడిపోయారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, February 3, 2018, 8:07 [IST]
Other articles published on Feb 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X