న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా ఓపెన్: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌... ప్రణీత్‌, కశ్యప్‌ కూడా

India Open: PV Sindhu, Kidambi Srikanth reach quarterfinals

హైదరాబాద్: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మరోవైపు సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో రెండోసీడ్‌ సింధు 21-11, 21-13తో డెంగ్‌ జోయ్‌ జువాన్‌ (హాంకాంగ్‌)పై అలవోక విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇక, సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 21-11, 21-16తో లూ గ్వాంఝూ (చైనా)పై విజయం సాధించాడు. కశ్యప్‌ 21-11, 21-13తో టాంగ్‌సాక్‌ సయెన్‌సోమ్‌బూన్‌సక్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గగా.. మరో మ్యాచ్‌లో ప్రణయ్‌ 21-19, 20-22, 21-17తో మాజీ ప్రపంచ నంబర్‌-2 జొర్గెన్సెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు.

స్విస్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ సాయిప్రణీత్‌ 18-21, 21-16, 21-15తో ఐదో సీడ్‌ సమీర్‌ వర్మకు షాకిచ్చాడు. ఇతర మ్యాచ్‌లలో మూడోసీడ్‌ హీ బింగ్జియావో (చైనా) 21-18, 21-17తో లీ జురుయ్‌ (చైనా)పై, నాలుగో సీడ్‌ రచనోక్‌ ఇంటనాన్‌ (థాయ్‌లాండ్‌) 21-18, 21-11తో చెన్‌ జియాజిన్‌ (చైనా)పై, హాన్‌ యూ (చైనా) 21-13, 21-8తో చనన్‌చిందా (థాయ్‌లాండ్‌)పై నెగ్గారు.

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్‌ తలపడనున్నాడు. మరోవైపు రియా ముఖర్జీ 8-21, 21-17, 13-21తో బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమిపాలైంది. ఇక, పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్‌ రెడ్డి జోడీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ రౌండ్-8లోకి అడుగుపెట్టింది.

మిక్స్‌డ్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ జోడీ 21-19, 19-21, 14-21తో ఫైజల్‌-గ్లొరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది.

Story first published: Friday, March 29, 2019, 9:10 [IST]
Other articles published on Mar 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X