న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకాంత్ తీసుకున్న నిర్ణయం సరైందే: కోచ్‌లకు శిక్షణపై పదుకొణె

By Nageshwara Rao
India needs coach education program: Prakash Padukone

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు మరింత పేరు తెచ్చేందుకు గాను ఎక్కువ మంది దేశీయ కోచ్‌లను తీర్చిదిద్దాలని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకోణె సూచించారు. ఇందులో భాగంగా కోచ్‌లకు శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో టాటా ఓపెన్ ఇండియా అంతర్జాతీయ ఛాలెంజ్ 10వ ఎడిషన్ సందర్భంగా ప్రకాశ్ పదుకొణె మాట్లాడారు.

 అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పేరు

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పేరు

పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పేరు తెస్తున్నారని కొనియాడారు. ఇలాంటి సమయంలోనే దేశీయ కోచ్‌లకు... అత్యున్నత స్థాయి కోచ్‌లతో శిక్షణ ఇప్పించాలని ఆయన చెప్పుకొచ్చారు. మనదేశంలో కూడా మంచి కోచ్‌లు ఉన్నారని అయితే వారు మరింత మెరుగుపడేందుకు సరైన అవకాశాలు రావడం లేదని చెప్పారు.

 దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది

దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది

'దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది. అందుకు తగ్గట్లు నాణ్యమైన కోచ్‌లు మనదగ్గర లేరు. కొందరే మంచి కోచ్‌లు ఉన్నారు. కానీ అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు నైపుణ్యాల్ని మెరుగు పర్చుకునేందుకు వారికి అవకాశం దొరకడం లేదు. ఇలాంటి కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు మంచి విదేశీ కోచ్‌ను నియమించాలి' అని అన్నారు.

 కోచ్‌లకు శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి

కోచ్‌లకు శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి

'50 నుంచి 100 మంది కోచ్‌లకు శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. భారత క్రీడాకారులు అవసరానికి మించి టోర్నీలు ఆడుతున్నారు. ఆల్‌ ఇంగ్లాండ్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌, సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ వంటి ముఖ్యమైన టోర్నీలపై భారత క్రీడాకారులు దృష్టిసారించాలి' అని సూచించారు.

 ఫామ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

ఫామ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

ముఖ్యంగా అంతర్జాతీయ టోర్నీలో జరిగే సమయంలో ఫామ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చైనా ఓపెన్‌, హాంకాంగ్‌ ఓపెన్‌లకు దూరంగా ఉండాలన్న శ్రీకాంత్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. పెద్ద టోర్నీలు ఆడింతే చాలా ర్యాంకింగ్‌ పాయింట్లు వస్తాయని అన్నారు. ప్రతి ఒక్క షట్లర్ వందకు వంద శాతం ఫిట్‌గా ఉండి.. ఆడిన ప్రతి టోర్నీ గెలవాలి. అగ్రశ్రేణి క్రీడాకారులు ఏడాదిలో ఒకటో, రెండో దేశవాళీ టోర్నీలు ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

 ఆటగాళ్లూ... దేశవాళీ టోర్నీలు ఆడండి

ఆటగాళ్లూ... దేశవాళీ టోర్నీలు ఆడండి

ఎందుకంటే దేశవాళీ టోర్నీలు ఆడబట్టి వారు ఈరోజు ఆ స్ధాయికి చేరుకున్నారని అన్నారు. 'ఇటీవల నాగ్ పూర్ వేదికగా జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులందరూ ఆడారు. దీంతో మీడియా కూడా ఈ టోర్నీని హైలెట్ చేసింది. ప్రేక్షకులు సైతం ఈ టోర్నీని చూసేందుకు ఎగబడ్డారు. అందుకే ప్లేయర్లందరకీ ఒకటే చెబుతున్నా.. ఏడాదికి ఒకటి లేదా రెండు దేశీయ టోర్నీల్లో ఆడండి. బ్యాడ్మింటన్‌కు ఎంతో మేలు చేసినవాళ్లవుతారు' అని ప్రకాశ్‌ అన్నారు.

Story first published: Wednesday, November 29, 2017, 13:12 [IST]
Other articles published on Nov 29, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X