న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను ఫిట్‌గా ఉంటా: సైనా నెహ్వాల్

‘I’m only thinking of fitness, not tournaments’: Saina Nehwal

హైదరాబాద్: భారత అగ్రశ్రేణి షట్లర్‌ సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్‌లో గెలిచినందుకు విజయానందంలో ఉంది. ఆ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సైనా తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసింది. ఆమెతో పాటుగా భారత యువ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ టైటిల్ విన్నర్ తైజును ఓడించడం పెద్ద కష్టమేమి కాదని అన్నాడు. వరుస టోర్నీల్లో పాల్గొనడంతో సమయాబావం వల్ల అలసిపోయానని పేర్కొంది.

ఇంకా, పూర్తి ఫిట్‌గా ఉండటమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ''పీబీఎల్‌ తర్వాత పెద్దగా సమయం దొరకలేదు. 5, 6 ప్రాక్టీస్‌ సెషన్‌లు జరిగాయంతే. అయినా మంచి ఫలితంతో తిరిగి రావడం సంతోషంగా ఉంది. గోపీ సర్‌కు కృతజ్ఞతలు. భవిష్యత్తు టోర్నీల గురించి ఆలోచించడం లేదు. హార్డ్‌వర్క్‌ చేస్తూ.. ఫిట్‌గా ఉండటమే నా లక్ష్యం.' అని వివరించింది.

' ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) అత్యుత్తమ క్రీడాకారిణి. భారతీయులే కాదు విదేశీ క్రీడాకారిణులు కూడా ఆమె చేతిలో ఓడిపోతున్నారు. ఐతే తై జు అజేయురాలేం కాదు. ఆమెను ఓడించే సత్తా మనకుంది'' అని సైనా తెలిపింది.

తైజును ఓడించగలను: శ్రీకాంత్
''తై జు బాగా ఆడుతున్న మాట నిజమే. కానీ పీబీఎల్‌లో తై జును ఓడించిన సంగతి మరిచిపోవద్దు. మ్యాచ్‌ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. ఆటలో ఎత్తుపల్లాలు సహజం. ఏకాగ్రతతో ఆడితే తై జును ఓడించడం అసాధ్యం కాదు'' అని పి.వి.సింధు చెప్పింది. ఇండియా ఓపెన్‌తో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడుతున్నందుకు ఆనందంగా ఉందని కిదాంబి శ్రీకాంత్‌ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 9:05 [IST]
Other articles published on Jan 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X