న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుత్తా జ్వాల అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 Hyderabad: Jwala Gutta Academy of Excellence website launched by KTR

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అకాడమీకి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ ఆరంభించారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాల అకాడమీ గురించి విశేషాల్ని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా మంది యువ ప్లేయర్లను గుత్తా జ్వాల అకాడమీ చాంపియన్లుగా తయారు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు చేసినందుకు గుత్తా జ్వాలకు ట్విట్టర్‌లో కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సిడ్నీలో కివీస్‌తో మూడో టెస్టు: 2020లో తొలి టెస్టు సెంచరీ చేసిన ఆటగాడిగా లబుషేన్ రికార్డుసిడ్నీలో కివీస్‌తో మూడో టెస్టు: 2020లో తొలి టెస్టు సెంచరీ చేసిన ఆటగాడిగా లబుషేన్ రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అకాడమీ వెబ్‌సైట్‌ ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా జ్వాల కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నటాషాతో పాండ్యా ఎంగేజ్‌మెంట్‌.. హార్ధిక్‌ మాజీ ప్రియురాలు ఏమందంటే?!!నటాషాతో పాండ్యా ఎంగేజ్‌మెంట్‌.. హార్ధిక్‌ మాజీ ప్రియురాలు ఏమందంటే?!!

గచ్చిబౌలి సమీపంలో ఓ స్కూల్‌లో దాదాపు 55 ఎకరాల స్థలంలో అకాడమీ ఏర్పాటు చేశామని గుత్తా జ్వాల పేర్కొన్నారు. ఇందులో 14 కోర్టులతో పాటు 600 సీటింగ్‌ సామర్థ్యం ఉందని అన్నారు. బ్యాడ్మింటన్‌తో పాటు మరిన్ని క్రీడల్లో ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యుత్తమ కోచింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. జనవరి చివరి వారంలో అకాడమీ ప్రారంభమవుతుందని జ్వాల తెలిపారు.

Story first published: Friday, January 3, 2020, 12:19 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X