పనికిరాని ప్రతిపాదనలు.. గోపీచంద్‌కు మద్దతుగా ప్రణయ్

Posted By:
HS Prannoy not happy with BWF’s proposed rule changes

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బ్యాడ్మింటన్‌లో కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇవేమీ అర్థం కాకుండా ఉన్నాయని, పైగా అవి అనవసరమైనవి అంటూ పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఈ నిర్ణయాలపై మండిపడ్డ భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు మద్ధతుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు.

తనకు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని అభిప్రాయపడ్డాడు. దీని ద్వారా లాభపడే వాళ్ల కంటే నష్టపోయే వాళ్లే ఎక్కువ అని పేర్కొన్నాడు. ఫిట్ నెస్ లేని వాళ్లకి కూడా సునాయాసంగా గెలుపును తెచ్చి పెట్టేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు.

ప్రతిపాదనలు ఏమిటంటే:

ప్రతిపాదనలు ఏమిటంటే:

బ్యాడ్మింటన్‌లో స్కోరింగ్‌ విధానాన్ని మార్చడం, మ్యాచ్‌ సందర్భంగా కోర్టులో కోచింగ్‌ సమయాన్ని తగ్గించడం వంటి ప్రతిపాదిత కొత్త విధానాలపై స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌. ప్రణయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మార్పుల వల్ల బ్యాడ్మింటన్‌ వాణిజ్య విలువను పెంచాలనే లక్ష్యం నెరవేరదని అతనన్నాడు.

గ్యాప్ ఉండాల్సిందే:

గ్యాప్ ఉండాల్సిందే:

మ్యాచ్‌లో 11 పాయింట్ల తర్వాత, ప్రతి గేమ్‌ తర్వాత ఉండే కోర్టు కోచింగ్‌ సమయాన్ని తగ్గించాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) కౌన్సిల్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతే కాకుండా మ్యాచ్‌లో... పాయింట్ల మధ్య, వార్మప్‌ చేసేందుకు, రాకెట్‌ను పరిశీలించుకునే సమయాన్ని కూడా తగ్గించాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది.

ఊపిరి తీసుకోవడం కూడా కష్టం:

ఊపిరి తీసుకోవడం కూడా కష్టం:

బ్యాడ్మింటన్‌ చాలా వేగవంతమైన క్రీడ. మ్యాచ్‌లో ఆటగాడికి తగినంత సమయం లేకపోతే ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. అంతే కాకుండా చెమటను తుడుచుకోవడానికి, కోర్టు బయటకు వెళ్లి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మన గురించి పూర్తిగా తెలిసిన కోచ్‌ మన పక్కన ఉండి చెప్పడం అవసరం. ఈ కొత్త విధానాలన్నీ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రణయ్‌ తెలిపాడు.

ఐదు గేమ్‌ల మ్యాచ్‌ ఆడించాలని:

ఐదు గేమ్‌ల మ్యాచ్‌ ఆడించాలని:

ప్రస్తుతం ఉన్న.. 21 పాయింట్ల మూడు గేమ్‌ల విధానాన్ని మార్చి 11 పాయింట్ల చొప్పున ఐదు గేమ్‌ల మ్యాచ్‌ ఆడించాలని బీడబ్ల్యూఎఫ్‌ ఆలోచిస్తోంది. స్కోర్ల విధానంలో మార్పు వల్ల ఫిట్‌గా లేని ఆటగాళ్లకు లాభం చేకూరే అవకాశం ఉందని ప్రణయ్‌ అన్నాడు.

శారీరకంగా ఫిట్‌గా లేని ఆటగాళ్లు:

శారీరకంగా ఫిట్‌గా లేని ఆటగాళ్లు:

నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే 21 పాయింట్ల గేమ్‌ విసుగు లేనపుడు మార్పులు చేయడం ఎందుకు? శారీరకంగా ఫిట్‌గా లేని ఆటగాళ్లు కొత్త విధానం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల వచ్చే కొన్నేళ్లలో ఇప్పటివరకూ తొలి 30 స్థానాల్లో లేని ఆటగాళ్లు అనూహ్యంగా ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని అనుకుంటున్నా.

ఆదరణ పెంచేలా చూడాలి:

ఆదరణ పెంచేలా చూడాలి:

ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగే టెన్నిస్‌ మ్యాచ్‌ అభిమానులను అలరించినపుడు.. కేవలం 90 నిమిషాల్లో ముగిసే బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌ను ఎందుకు చూడరు. విధానాలు, నియమాలు మార్చడం కాదు ఆట పట్ల ఆదరణ పెంచేలా చూడాలి'' అని ప్రణయ్‌ వివరించాడు. కాలికి పులిపిర్ల కారణంగా ఈ సీజన్‌లో ప్రణయ్‌ చాలా మ్యాచ్‌లు ఆడలేదు. ఫిబ్రవరి మొదట్లో చికిత్స చేయించుకున్న ప్రణయ్‌... మార్చి 14న ఆరంభమయ్యే ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీ కోసం సాధన మొదలెట్టాడు.

Story first published: Thursday, March 1, 2018, 12:33 [IST]
Other articles published on Mar 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి