న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్నంటే ఉండి.. ద్యుతీని గెలిపించిన గోపీచంద్

Gopichand who helped Dutee in darkest hour proud of her achievement

జకార్తా: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో స్టార్ స్ప్రింటర్ ద్యుతిచంద్ భారత్‌కి ఆదివారం రజత పతకాన్ని అందించింది. 100 మీటర్ల రేసులో పోటీపడిన ద్యుతిచంద్ కేవలం 11.32 సెకన్లలో పరుగుని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 1998 తర్వాత ఆసియా గేమ్స్‌లో ఓ భారత స్ప్రింటర్ 100 మీటర్ల రేసులో పతకం గెలవడం ఇదే తొలిసారి. అయితే.. 2014‌లో ద్యుతి శరీరంలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయనే కారణంతో.. ఆమెపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య(ఐఏఏఎఫ్) నిషేధం విధించింది.

దీంతో ఈ స్ప్రింటర్ కెరీర్‌ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. ఆ నిషేధంపై అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానంలో అలుపెరగని పోరాటం చేసిన ద్యుతిచంద్‌కి కేంద్ర క్రీడా శాఖ, భారత జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మద్దతుగా నిలిచారు. దీంతో.. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ద్యుతీకి అనుకూలంగా తీర్పుని వెలువరించింది.

ద్యుతీ నిషేధం నుంచి ఆ తర్వాత మళ్లీ ట్రాక్‌పై పరుగు తీసే వరకూ ఆమెకి వెన్నంటే నిలిచిన గోపీచంద్.. విమర్శలు వస్తున్నా.. మద్దతుగా నిలిచి తన అకాడమీలోనే ఉండే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆసియా గేమ్స్‌ జరుగుతున్న జకర్తాలోనే ఉన్న గోపీచంద్.. ద్యుతి రజత పతకం గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

జకర్తా నుంచి ప్రముఖ మీడియాతో మాట్లాడిన గోపీచంద్.. 'ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆసియా గేమ్స్‌లో ద్యుతి చంద్ సాధించిన రజత పతకం అథ్లెట్స్‌ అందరికీ స్ఫూర్తి. ఆమె చాలా ఒత్తిడి మధ్య ఈ టోర్నీకి వచ్చింది. ద్యుతిచంద్ అంకితభావం, స్ఫూర్తికి సెల్యూట్ చేయొచ్చు. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని విజయాల్ని సాధించాలనుకునే వారికి ఆమె కచ్చితంగా ఓ రోల్‌ మోడల్' అని కితాబిచ్చారు.

Story first published: Monday, August 27, 2018, 12:42 [IST]
Other articles published on Aug 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X