భారత్ లాంటి పేద దేశాలకు సాయం చేయలేం.. సారీ సింధూ..

Posted By: Subhan
Goodbye PV Sindhu, won't support poor countries like India: Hacked Yonex account post

హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఉద్దేశించి జపాన్‌కు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ యోనెక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. సింధుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సంస్థ.. భారత్ లాంటి పేద దేశానికి మద్దతు ఇవ్వలేమని తెలిపింది.

జపాన్‌ యువ అథ్లెట్ల పట్ల దృష్టి పెడతామంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. గుడ్ బై సింధు అంటూ భారత బ్యాడ్మింటన్ స్టార్‌ ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాసేపటి తర్వాత ఈ పోస్టును డిలీట్ చేసిన యోనెక్స్ తమ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ వెల్లడించింది.

A post shared by YONEX (@yonex_com) on Feb 10, 2018 at 3:36am PST

పోస్ట్ తొలగించిన మేనే‌‌జ్‌మెంట్ తర్వాత మళ్లీ అధికారికంగానే తమకు తెలియకుండా తప్పుడు పోస్ట్ వచ్చినందుకు మన్నించాలని ఫాలోవర్లను కోరింది. ఇలాంటి తప్పిదం మళ్లీ జరగదని హామీ ఇచ్చింది. అయితే విడ్డూరంగా సదరు సంస్థకు సింధు తన మద్ధతును తెలిపింది.

యోనెక్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని చెప్పిన సింధు.. యోనెక్స్ టీం తనకు క్షమాపణలు చెప్పిందని ట్వీట్ చేసింది. ఈ తప్పిదాన్ని మన్నిస్తున్నాని చెప్పిన తెలుగు తేజం.. ఈ ఏడాది యోనెక్స్‌తో కలిసి పని చేయడానికి తనకు ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 14:55 [IST]
Other articles published on Feb 11, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి