న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలెక్టర్‌కు పిటిషన్‌: పీవీ సింధుతో వివాహం చేయాలి.. లేదంటే అపహరించి పెళ్లి చేసుకుంటా!!

Files petition: 70 year old Man wants to marry PV Sindhu, says will kidnap her otherwise

చెన్నై: ఈ వార్త చదివేందుకు కాస్త ఎబెట్టుగా ఉండొచ్చు. అదే సమయంలో ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. భారత బ్యాడ్మింటన్‌ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుతో తనకు వివాహం చేయాలని కోరుతూ ఓ వ్యక‍్తి జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు. అయితే ఆ పిటిషన్‌ వేసిన వ్యక్తి వయసు అక్షరాలా 70 ఏళ్లు. పిటిషన్‌లో మాత్రం ఆ వ్యక్తి తనకు 16 ఏళ్లు మాత్రమేనని, సింధు కెరీర్‌ ఆసాంతం తనను ఆకట్టుకున్నందున ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.

<strong>'ఆర్చర్‌ సాధిస్తాడు.. అతను జట్టులో ఉండటం మా అదృష్టం'</strong>'ఆర్చర్‌ సాధిస్తాడు.. అతను జట్టులో ఉండటం మా అదృష్టం'

వారాంతపు సమావేశంలో మలైస్వామి

వారాంతపు సమావేశంలో మలైస్వామి

వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. మలైస్వామి సింధు ఆట పట్ల ఆకర్షితుడయ్యాడు. సింధు ఆటను అతడు చూసేవాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వారాంతపు సమావేశంలో మలైస్వామి కూడా పాల్గొన్నాడు.

జీవిత భాగస్వామిని చేసుకుంటా

జీవిత భాగస్వామిని చేసుకుంటా

సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను జతచేసి కలెక్టర్‌కు మలైస్వామి అర్జీ పెట్టుకున్నాడు. పిటిషన్‌లో మలైస్వామి 2004 ఏప్రిల్‌ 4న పుట్టానని పేర్కొన్నాడు. అంటే అతని వయసు కేవలం 16గా పేర్కొన్నాడు. సింధు వయసు 24 ఏళ్లు.

కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధం

కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధం

పిటిషన్‌తో ఆగకుండా.. ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే.. ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని మలైస్వామి పేర్కొన్నాడు. చివరగా సింధుతో తన పెళ్లి చేయాలని పట్టుపట్టాడు. ఈ పిటిషన్‌తో కలెక్టర్‌తో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నిజామా లేదా ఒక జోకా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలామంది దీనిపై చర్చించుకుంటున్నారు.

Story first published: Tuesday, September 17, 2019, 16:24 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X