న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్: పోరాడి ఓడిన సింధు, రజతంతో సరి

By Nageshwara Rao
PV Sindhu Wins Silver After Loss To Japan's Akane Yamaguchi In Final

హైదరాబాద్: దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. టోర్నీ సాంతం అద్భుత ప్రదర్శన చేసిన పీవీ సింధు ఉత్కంఠగా సాగిన సూపర్‌ సిరీస్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమి ఓడిపోయింది. 93 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-15, 12-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది.

టోర్నీలో భాగంగా గ్రూప్ స్టేజిలో యమగూచిపై విజయం సాధించిన సింధు... ఫైనల్లో ఓటమి పాలవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పైనల్లో తొలి గేమ్‌ను 21-15తో సింధు విజయం సాధించింది. అయితే రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న యమగుచి.. వరుసగా పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 12-21తో మయగూచి కైవసం చేసుకుంది.

దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. మూడో గేమ్‌లో తొలుత సింధు ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. ఆ తర్వాత వెనుకబడింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు ప్లేయర్స్ తీవ్రంగా శ్రమించారు. ఒకానొక దశలో 19-19తో ఇద్దరూ స్కోర్లు సమమయ్యాయి.

ఆ సమయంలో రెండు వరుస పాయింట్లతో యమగుచి టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది రెండు సూపర్ సిరీస్ టైటిల్స్(ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్)తోపాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన సింధు, ఈ టైటిల్‌ను కూడా గెలిచి ఉంటే.. 2017ను ఘనంగా ముగించేది.

ఈ టోర్నీలో వరుసగా తన విజయ పరంపరను కొనసాగించిన సింధు చివర్లో తడపడి టైటిల్‌కు దూరం చేసింది. గతేడాదే తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్‌ సిరీస్‌లో అడుగిడిన సింధు.. అప్పట్లో సెమీస్‌ దశను దాటలేకపోయింది. కానీ, ఈ సారి పైనల్స్‌కు చేరుకున్నప్పటికీ టైటిల్‌ పోరులో వెనకబడింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 17, 2017, 17:59 [IST]
Other articles published on Dec 17, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X