న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'సైనాను ఎప్పుడూ విస్మరించలేదు.. అకాడమీ నుంచి వెళ్లొద్దని చాలా బతిమిలాడా'

Dont know why Prakash Padukone encouraged Saina to leave my academy says Pullella Gopichand


హైదరాబాద్:
భారత బ్యాడ్మింటన్‌ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఎప్పుడూ విస్మరించలేదు. 2014లో సైనా నా అకాడమీని వీడుతుంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది. ఆమెను వెళ్లొద్దని చాలా బతిమిలాడా. ఇతరుల ప్రభావంతో ఆమె అప్పటికే వెళ్లడానికి నిర్ణయించుకుంది అని జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పేర్కొన్నారు. గోపీచంద్‌పై ప్రముఖ క్రీడా జర్నలిస్ట్‌ బోరియా మజుందార్‌ 'డ్రీమ్స్ ఆఫ్‌ ఎ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌' అనే పుస్తకం రాస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోపిచంద్‌.. ప్రియ శిష్యురాలు సైనా వివాదాన్ని మజుందార్‌తో పంచుకున్నారు.

బుమ్రాకు బీసీసీఐ అత్యున్నత పురస్కారం.. శ్రీకాంత్‌కు 'లైఫ్‌ టైమ్‌'అవార్డు!!బుమ్రాకు బీసీసీఐ అత్యున్నత పురస్కారం.. శ్రీకాంత్‌కు 'లైఫ్‌ టైమ్‌'అవార్డు!!

'2014లో సైనా అకాడమీని వీడుతుంటే.. అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది. వెళ్లొద్దని అంతకుముందే చాలా బతిమిలాడా. ఇతరుల ప్రభావంతో ఆమె అప్పటికే వెళ్లడానికి సిద్దమయింది. ఇక నేను ఆపలేకపోయా. తను వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలుసు. ఆ సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. పీవీ సింధు 2012- 2014 కాలంలో అత్యుత్తమంగా రాణించింది. అయినా.. ఎప్పుడూ సైనా నెహ్వాల్‌ను విస్మరించలేదు' అని గోపిచంద్‌ తెలిపారు.

'నా రోల్‌ మోడల్‌ అయిన ప్రకాశ్‌ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. అతను సైనాతో మాట్లాడాల్సింది. వాళ్లెందుకు మాట్లాడుకోలేదో నాకు తెలీదు. సైనాని హైదరాబాద్‌ వీడమని బలవంతం చేశారు. ప్రకాశ్‌ సర్‌ నా గురించి ఎందుకు తనతో చర్చించలేదో ఇప్పటికీ అర్థంకావడంలేదు. ప్రకాశ్‌ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. కానీ ఆయన మాత్రం బ్యాడ్మింటన్‌కు ఇంతచేసినా నా సేవల గురించి ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మంచి మాటగానీ చెప్పలేదు. ప్రశంసలుగానీ కురిపించలేదు' అని గోపీ చెప్పుకొచ్చారు.

మజుందార్ రచించిన ఈ పుస్తకం ఈనెల 20న విడుదలవుతుంది. ఈ పుస్తకంలో సైనా భర్త, షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కూడా తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. 'గోపీచంద్‌ తనకు మాత్రమే కోచ్‌గా ఉండాలని సైనా భావించింది. అయితే ఒక్కసారిగా సింధు మంచి ఫలితాలు సాధించడంతో గోపీచంద్‌ కేవలం సైనాపైనే దృష్టి పెట్టకుండా ఇతరులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయితే ఈ అంశాన్ని సైనా నెగెటివ్‌గా తీసుకుంది. సైనాకు నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ నా మాటలు పట్టించుకోలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో సైనా గాయంతోనే ఆడింది. లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. సైనాకు అది గడ్డుపరిస్థితి. గోపీ అకాడమీ నుంచి నిష్క్రమించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది' అని కశ్యప్‌ తెలిపాడు.

Story first published: Monday, January 13, 2020, 10:04 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X