కామన్వెల్త్‌ గేమ్స్‌: సెమీస్‌కు చేరిన సిందు, శ్రీకాంత్, ప్రణయ్, సైనా

Posted By:
CWG 2018, badminton: Srikanth, HS Prannoy PV Sindhu and Saina Nehwal make semis

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్‌ గేమ్స్‌ తుది దశకు చేరుకున్నాయి. వెయిట్ లిఫ్టర్లు, షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా నెహ్వాల్‌ 21-8, 21-13 తేడాతో రచెల్‌ హండ్రిచ్‌(కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత పీవీ సింధు 21-14, 21-7 తేడాతో మరో కెనడా క్రీడాకారిణి బిట్నీ టామ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.

ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌‌వన్‌ కిదాంబి శ్రీకాంత్‌ 21-15 21-12 తేడాతో ర్యాన్‌ ఎంగ్‌ జిన్‌ రేయ్‌(సింగపూర్‌)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. అంతకముందే హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సైతం సెమీస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఆటగాడు దినుకా కరుణరత్నాను వరుస గేమ్‌ల్లో ఓడించి ప్రణయ్ సెమీస్‌కు చేరాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ సాత్విక్‌- పొన్నప్ప జోడీ సెమీస్‌కు చేరింది. సాత్విక్‌-పొన్నప్ప జోడి 2-0తో గో సూన్‌ హాట్‌-షెవాన్‌ జెమీపై గెలిచి సెమీస్‌కు చేరింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జోడి 2-0తో హాసిని-దిల్రుక్షి( శ్రీలంక) జంటపై గెలిచి సెమీస్‌కు చేరారు.

Story first published: Friday, April 13, 2018, 21:25 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి