న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్స్‌‌లో సింధు ఓటమికి అసలు కారణం చెప్పిన కరోలినా మారిన్

By Nageshwara Rao
Carolina Marin says PV Sindhu needed to control Nervousness in the final match

హైదరాబాద్: సింధుపై ఎలా ఆడాలో తనకు తెలుసుని ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ వెల్లడించింది. ఇటీవలే చైనా వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పీవీ సింధుపై 21-19, 21-10 తేడాతో కరోలినా మారిన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నాకు నేనుగా చెప్పుకున్నా: సింధుపై గెలిచి మారిన్ మరో చరిత్రనాకు నేనుగా చెప్పుకున్నా: సింధుపై గెలిచి మారిన్ మరో చరిత్ర

ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు స్వర్ణ పతకం నెగ్గిన ఏకైక షట్లర్‌గా 25 ఏళ్ల మారిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి స్వదేశం స్పెయిన్ వెళ్తూ విమానాశ్రయంలో కరోలినా మాట్లాడుతూ సింధుకు విలువైన సూచనలు చేసింది.

ఫైనల్స్‌లో సింధు ఎందుకు గెలవలేకపోతోందన్న విషయం తనకు సరిగ్గా తెలియదని తెలిపింది. ఫైనల్స్ ఆడేటప్పుడు సింధు ఆందోళనకు గురవుతున్నట్టు అనిపిస్తోందని మారిన్ వెల్లడించింది. ఫైనల్స్‌లో ఆడేటప్పుడు సింధు ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఒత్తిడిని నియంత్రించుకోగలిగితే సింధు విజయాలను సొంతం చేసుకుంటుందని మారిన్ పేర్కొంది.

ఫైనల్స్ కోసం తాను చాలా కష్టపడతానని, తామిద్దరం ప్రత్యర్థులుగా తలపడేటప్పుడు సింధుపై ఎలా ఆడాలో తనకు బాగా తెలుసని మారిన్ తెలిపింది. ఒత్తిడికి ఆమె గురవుతుందో లేదో తనకు తెలియదని, కానీ, మ్యాచ్ సమయంలో తాను ఆమెపై ఒత్తిడి పెంచుతూనే ఉంటానని మారిన్ పేర్కొంది.

తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొన్న మారిన్ టోర్నమెంట్ల సమయంలో తామిద్దం కలిసి షాపింగ్‌లకు వెళ్లమని, సీక్రెట్‌లు షేర్ చోసుకోబోమని తెలిపింది. గత రెండేళ్లలో రెండు మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో కరోలినా చేతిలో సింధు ఓటమిపాలైంది. ఒకటి 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్స్ కాగా, రెండోది ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన సింధుప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన సింధు

ఈ రెండు టోర్నీ ఫైనల్స్‌లో కరోలినాకు ప్రత్యర్ధి పీవీ సింధునే కావడం విశేషం. కాగా, రెండేళ్ల క్రితం జరిగన రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధు-మారిన్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను భారత్‌లో 17.2 మిలియన్ల మంది వీక్షించారు. ఫలితంగా క్రికెట్ తర్వాత ఎక్కుమంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది.

Story first published: Thursday, August 9, 2018, 13:03 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X