న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పిన పెను ప్రమాదం: కారు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డ వరల్డ్ NO.1 షట్లర్‌

Badminton world No.1 Kento Momota injured in car accident in Malaysia, driver killed

హైదరాబాద్: ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు కెంటో మొమోటా మలేషియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన కొన్ని గంటల్లోనే అతడు ఈ ప్రమాదానికి గురవడం విశేషం.

సోమవారం తెల్లవారుజూమున కెంటో మొమోటాతో పాటు మరో ముగ్గురు కౌలలాంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా వీరంతా ప్రయాణిస్తున్న వ్యాన్‌ 30 టన్నుల బరువుతో నిదానంగా వెళ్తున్న లారీని వెనకు నుంచి అమాంతం ఢీ కొట్టింది.

పటౌడీ ప్రసంగంలో ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను పిల్లల డైపర్‌తో పోల్చిన సెహ్వాగ్పటౌడీ ప్రసంగంలో ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను పిల్లల డైపర్‌తో పోల్చిన సెహ్వాగ్

ఈ రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌ భావన్ అలియాస్ నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించగా... కెంటోతో పాటు ఉన్న అతడి అసిస్టెంట్‌ కోచ్‌ మోరిమోటో ఆర్కిఫుకి., ఫిజియోథెరపిస్ట్‌ హిరాయమా యు, బ్రిటిష్ బ్యాడ్మింటన్ టెక్నికల్ ఆఫీసర్ ఫోస్టర్ విలియం థామస్ తీవ్ర గాయాలయ్యాయి.

ఇక, కెంటో మొమోటా ముక్కు పగలడంతో పాటు అతడి ముఖానికి గాయమైంది. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పుత్రజయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

డెత్ ఓవర్లను బలోపేతం చేసేందుకు: నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి డ్వేన్ బ్రావోడెత్ ఓవర్లను బలోపేతం చేసేందుకు: నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి డ్వేన్ బ్రావో

ఈ సంఘటనపై మలేషియా యువజన, క్రీడా శాఖ మంత్రి సయ్యద్ సద్దిక్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గాయపడిన వారు నలుగురూ స్థిరంగా ఉన్నారని, వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం జరిగిన మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్‌ సూపర్‌ లీగ్‌ ఫైనల్లో కెంటో 24-22, 21-11 తేడాతో విక్టోర్‌ను మట్టికరిపించి టైటిల్‌ గెలిచాడు.

25 ఏళ్ల మొమోటా ఇటీవల జరిగిన ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి ఒకే ఏడాది 11 టైటిల్స్‌ గెలిచిన తొలి షట్లర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, January 13, 2020, 14:28 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X